బైక్ రైడర్స్ ...స్లిప్పర్లతో తిరిగినా జరిమానా!
posted on Sep 10, 2022 @ 4:45PM
స్కూల్లో పిల్లల్ని దింపడానికి పిల్లల్ని ఎక్కించుకుని రయ్‌న హైవేలో ఇష్టం వచ్చినట్టు వెళ్లడానికి ఇక కుద రదు. గర్ల్‌ఫ్రెండ్‌ని ఎక్కించుకుని పవర్‌స్టార్‌లా భావించుకుని వేగంగా రివ్వున వెళ్లేవారికి ఇక కష్టమే అంటు న్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ నిబంధనలకు తోడు మరింతగా జరిమానాల దాడులు పెరిగే అవకాశం ఉంది.
ఇకనుంచి నోట్లో బ్రెష్ పెట్టుకుని స్లిప్పర్లతో, నిక్కర్ టీ షర్టుతో చాలా చిరాగ్గా టూవీలర్ మీద బయటికి వెళ్లే వారికి భారీ జరిమానా పడే అవకాశం ఉంది. మరంచేత కడు జాగ్రత్త. ఫ్రెండ్ ఫోన్ చేశాడని, బస్ స్టాప్ పక్కనే ఉందిగదా అని స్లిప్లర్లేసుకుని, చాలా నిర్లక్ష్యంగా బండిమీద బయటికివస్తే వెయ్యి రూపా యల జరిమానా పడే అవకాశం ఉంది. ఆనక పోలీసువారితో గొడవపడటం, జరిమానా తగ్గించాలని వేడుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పటివరకూ ఒక లెక్క, ఇక నుంచి వేరే.. అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు, మోటార్ వాహనాల చట్టం మరింత కఠిన నిబంధనలు అమలు చేయనుంది.
మరో కఠిన నిబంధన ఏమిటంటే టీ షర్టు, షార్టులు వేసుకుని అస్సలు డ్రైవ్ చేయద్దంటున్నారు. జిమ్‌కి వెళుతున్నాను, సరదాగా తిరగడానికి ఇలానే వెళతాను అంటే కుదరదు. ఇక నుంచి షార్ట్‌తో, టీ షర్టుతో వెళ్లబోయే ముందు ఒక్కసారి జరిమానాను గుర్తుచేసుకోవాలి. ఈ నిబంధనను కాదని పోలీసులను పట్టిం చుకోకుండా, పక్క గల్లీల్లోంచి వెళ్లచ్చు అనుకుంటే సరే. అన్ని అనుకూలిస్తే ఇంటికి వెళతారు. లేకపోతే రూ.2000 జరిమానా కట్టి మరీ ఇంటికి వెళ్లవలసి వస్తుంది. అందువల్ల బైక్ మీద వెళ్లే అందరూ తప్పకుం డా హెల్మెట్ పెట్టుకోవడం, సంబంధిత పత్రాలతో పాటు ఈ చిన్నపాటి నిబంధనలను కూడా తప్పకుం డా, సీరియస్ గా పట్టించుకోవాలి. లేకపోతే జరిమానాకు దొరికిపోతారు.