పోలేరమ్మను దర్శించుకున్న పి.వి.సింధు
posted on Sep 15, 2022 @ 3:05PM
ఏ వృత్తిలో ఉన్నా చాలామందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. కొందరికి భక్తి ఎక్కువ ఉంటుంది, కొందరు కేవలం నామస్మరణ చేస్తుంటారు. మరికొందరు తరచూ దైవదర్శనానికి వెళుతూంటారు. క్రీడాకారులూ ఇం దుకు మినహాయింపుకాదు. అసలా మాటకి వస్తే, పెద్ద పెద్ద పారి శ్రామికవేత్తలకు, అంతర్జాతీయ క్రీడా కారులకూ భక్తితో కూడిన నమ్మకాలు బాగానే ఉంటాయి. పొద్దుటే చిన్నపాటి పూజ చేసిగాని బయట పడని వారు చాలామంది ఉంటారు. కొందరు ఉన్నచోటనే ఏదో ఒక గుడికి వెళుతూంటారు. మరికొందరికి ఫలానా దేవత దర్శనం అంటూ పర్యటనకు వెళతారు. ఎవరి ఇష్టం వారిది. ఆటల్లో అందు లోనూ అంత ర్జాతీయ స్థాయిలో నిత్యం ఉన్నత స్థాయిలోనే ఉండడం కష్టం. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధూ అయినా సరే!
పోలేరమ్మ జాతర సందర్భంగా పి.వి.సింధు నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలేరమ్మను కుటుంబ సమేతం గా దర్శించుకున్నది. పోలేరమ్మ అమ్మ వారి దేవస్థానం లొ ప్రత్యేక పూజలు చేసారు పి వి సింధు. అమెకు సాదరంగా ఆహ్వానం పలికారు మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు రామనారాయణ రెడ్డి.
అంతర్జాతీయ స్థాయిలో మరింత బాగా రాణించాలంటే అమ్మవారి ఆశీస్సులు అవసరమని భావించి ఉం డవచ్చు. అందుకే ఆమె అమ్మవారికి దర్శనానికి వచ్చివెళ్లింది సింధు. ఎప్పుడూ ఒకేలా అత్యంత అద్భు తంగా సత్తా ప్రదర్శించడం కష్టం. కష్టఫలి అన్నారు. కానీ ఆటల్లో ఎంత కష్ట పడి నా ఒక్కోసారి చిన్నపొర పాటుకు ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అపుడు మానసికంగా ప్లేయ ర్లు కుంగి పోతారు. అదు గో అలాంటి పరిస్థితుల్లో మనశ్శాంతి అవసరం. అందుకనే ధ్యానం, దైవదర్శనం చేస్తుంటారు, ఎంతటి స్టార్ ప్లేయర్లయినా. సింధూ కూడా అంతే.