ప్రామిస్ డే.. బంధంలో నమ్మకానికి పునాది ఇదే..!
posted on Feb 11, 2025 @ 9:30AM
వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న ప్రారంభమై ఫిబ్రవరి 14న ముగుస్తుంది. ఈ వాలెంటైన్స్ వారంలో ప్రతి రోజు సంబంధాలు, ప్రేమకు సంబంధించి విభిన్న అంశాలు రోజుకు ఒకటిగా ప్రాముఖ్యత చోటు చేసుకున్నాయి. వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తో ప్రారంభం అవుతుంది ఇది వాలెంటైన్స్ డే తో ముగుస్తుంది. ప్రేమించే ప్రతి ఒక్కరూ తమకు తమ భాగస్వామి ఎంత ముఖ్యమో, తమ భాగస్వామి పట్ల తమకున్న ప్రేమ ఎంత గొప్పదో తెలియజేయడానికి, వ్యక్తం చేయడానికి ఈ వాలెంటైన్స్ వీక్ చాలా మంచి వేదిక అవుతుంది.
ప్రామిస్ డే..
సంబంధాలలో నిబద్ధత, విధేయత ప్రాముఖ్యతను ప్రామిస్ డే నొక్కి చెబుతుంది. ప్రామిస్ డే అనేది వాలెంటైన్స్ వారంలో ఐదవ రోజు. ఇది సంబంధాలలో బలాన్ని పెంచుతుంది. ప్రామిస్ డే రోజు భాగస్వామికి వాగ్దానాలు చేయడం, బంధం పట్ల ఉన్న నిబద్ధతను చాటిచెప్పడం, బంధానికివిలువ ఇవ్వడం, కష్టాల్లో ఒకరికొకరు అండగా ఉంటామని ప్రామిస్ చేసుకోవడం. ఇది భాగస్వాముల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. నమ్మకం, అవగాహన, ఒకరి పట్ల మరొకరు విధేయతగా ఉండటం వంటి విషయాలను ప్రామిస్ తెలుపుతుంది. ప్రేమను, బంధం పట్ల గౌరవాన్ని తెలియజేస్తూ హృదయపూర్వకంగా ఉత్తరాలు రాయడం, లేదా ప్రేమ లేఖలు రాయడం, మనసులో ఉన్న అమితమైన ప్రేమకు అక్షరరూపం ఇవ్వడం లేదా మనసులో ఉన్న ప్రేమను ఏదో ఒక అందమైన చర్యతో వ్యక్తం చేయడం ద్వారా ప్రామిస్ డే ను అందంగా మార్చుకోవచ్చు.
నమ్మకమే పునాది..
ఏ బంధానికి అయినా నమ్మకమే పునాది అవుతుంది. స్నేహం, ప్రేమ, ఇతర బందాలు ఏవైనా నమ్మకం అనే పునాదుల మీదనే బాగుంటాయి. ఆ పునాది సరిగా లేకపోతే బంధం కుప్పకూలిపోతుంది. ప్రేమికులకు, ప్రేమను మనసులో నింపుకున్నవారికి కూడా అంతే.. నమ్మకం అనే పునాది బాగుంటేనే వారి బంధం వివాహం వరకు వెళ్లగలుగుతుంది. ఆ నమ్మకాన్ని ప్రామిస్ ఇవ్వగలుగుతుంది. అందుకే ప్రామిస్ డేకి అంత ప్రాముఖ్యత.
*రూపశ్రీ.