తమ్ముడితో.. తల్లి అయిన టీచర్..
posted on Apr 26, 2021 @ 11:52AM
ఆమె ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్. లాక్ డౌన్ కావడం వల్ల ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ క్లాసులు చెపుతుంది. టీచర్ బంధువు అయిన ఒక యువకుడు వాళ్ళ ఇంటికి వచిపోతూ వచ్చిపోతు ఉండేవాడు. ఉన్నట్లుండి ఆ టీచర్ కి వాంతులు అయ్యాయి. తల్లి దండ్రులు ఫుడ్ పడక అనుకున్నారు. రోజులు మారాయి. నెలలు కడిచాయి.
కట్ చేస్తే.. ఈ టీచర్ పెళ్లి కాకుండానే తల్లి అయింది. అదేంటని అనుకుంటున్నారా. అయినా.. ఇలాంటి వార్తలు ఎప్పుడు వింటూనే ఉంటాం కదా అనుకుంటున్నారు కాదు. అలా అనుకుంటే మీరు కరోనా మీద కాలు వేసినట్లే. అవును విత్ అవుట్ పెళ్లి, తల్లి కావడం వేరు. ఎవరైనా బావతోనో, భర్త తోనో, లేదంటే లవర్ తోనో తల్లి అవుతారు. కానీ ఈ ప్రైవేట్ టీచర్ వరసకు తమ్ముడు అయ్యే వాడితో తల్లి అయింది. అదెలా అనుకుంటున్నారా.. ఆవిడ చేసిన ఘనకార్యం ఏంటో మీరే చూడండి.
కోవిడ్ కారణంగా స్కూల్స్, కాలేజీ లు తెరవకపోవడంతో తమ బంధువుల అబ్బాయి ఆదీష్ కుమార్ (20) టీచర్ ఇంటికి వస్తూ, పోతూ ఉండేవాడు. ఆదీష్ తనకు వరసయ్యే అక్కతో చనువుగా మెలిగాడు. టీచర్ అయిన అక్క కూడా తమ్ముడే కదా అని కాస్త చనువు ఇచ్చింది. అతనితో సన్నిహితంగా మెలిగింది. ఆ సన్నిహితం కాస్తా సాన్నిహిత్యం గా మారింది. అప్పుడప్పుడు అనుమానం వచ్చి ఈ సీన్ చూస్తున్న తల్లిదండ్రులు కూడా అక్కా, తమ్ముళ్లే కదా అని అడ్డు చెప్పలేదు.
తమ్ముడి వరుస అయిన యువకుడితో కూతురు చేసిన పాడుపనిని తలుచుకొని తల్లిదండ్రులు రోధించారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆమెకు అబార్షన్ చేయించాలని చూశారు. కానీ అది వీలు కాకపోవడంతో బయట పరువు పోకూడదని యువతిని ఇంట్లోనే బంధించారు. అయితే ఇటీవలే యువతికి నొప్పులు రావడంతో ఇంట్లోనే ఆమెకు పురుడు పోశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇలాంటి బిడ్డ ఉండకూడదని చెప్పి తల్లిదండ్రులు పసికందును చెత్తకుండీలో పడవేశారు. అయితే, తీవ్ర రక్తస్త్రావంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందడంతో గుట్టురట్టు అయ్యింది. చుట్టుపక్కల వారి అనుమానాలతో వ్యవహారం పోలీసుల దగ్గరకు చేరింది. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తల్లిదండ్రులను, తమ్ముడు వరసయ్యే యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన చైన్నై దిండుగల్ జిల్లా పళని ఆరుకుడిలో జరిగింది.