మరో 27 స్మార్ట్ నగరాల ప్రకటన..జాబితాలో తిరుపతి
posted on Sep 20, 2016 @ 5:08PM
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇవాళ మరో జాబితాను ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు 27 నగరాలతో కూడిన కొత్త నగరాల జాబితాను ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 నగరాలను ఎంపిక చేయాలని నిర్ణయించిన కేంద్రం ఈ ఏడాది మే నెలలో 13 నగరాలను ప్రకటించింది. మిగిలిన 27 నగరాలను ఇవాళ ప్రకటించింది. ఈ జాబితాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి స్థానం లభించింది.
జాబితాలో ఉన్న నగరాలు ఇవే: ఆగ్రా, అజ్మీర్, అమృత్‌సర్, ఔరంగాబాద్, గ్వాలియర్, హుబ్లీ-దార్వాడ్, జలంధర్, కళ్యాణ్-బొంబ్వాలి, కాన్పూర్, కోహిమా, కోటా, మధురై, మంగుళూరు, నాగపూర్, నామ్‌చి, నాసిక్, రూర్కెలా, సేలం, షీమోగా, థానే, తంజావూర్, తిరుపతి, తుముకూరు, ఉజ్జయిని, వడోదరా, వెల్లూరు, వారణాసి