కశ్మీర్‌లో 74 రోజుల కర్ఫ్యూకి తెర..
posted on Sep 20, 2016 @ 4:11PM
సుమారు 74 రోజుల పాటు కశ్మీర్ లోయలో అమల్లో ఉన్న కర్ఫ్యూకి తెరపడింది. శ్రీనగర్‌లోని ఆరు పోలీస్ స్టేషన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఇవాళ్టీ నుంచి కర్ఫ్యూని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీని సైన్యం హతమార్చడంతో కశ్మీర్ లోయలో హింస చేలరేగింది. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. దీంతో ప్రభుత్వం అక్కడ కర్ఫ్యూ విధించింది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 81 మంది మృతి చెందగా, వారిలో ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. వేలాది మంది పౌరులు ఉన్నారు. అయితే పరిస్థితులు కొంచెం మెరుగుపడటంతో ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రవాణా వ్యవస్థను మెరుగుపరిచారు. విద్యా, వ్యాపార సంస్థలను పెట్రోల్ దుకాణాలను కొన్నింటిని ఇంకా మూసివేసే ఉంచారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను మాత్రం ఇంకా అనుమతించలేదు.