జాతీయ పతాకాన్ని భద్రపరచండి
posted on Aug 22, 2022 @ 5:13PM
స్వాతంత్య్రదినోత్సవం అనగానే దేశమంతా దేశభక్తి ఒక్కసారిగా పెల్లుబుకుతుంది. ప్రతీ నగరం, పల్లె దేశభక్తి గీతాలు, పతాకాల రెపరెపలతో కనువిందు, వీనుల విందూ చేస్తుంటాయి. అదో పండుగ వాతావర ణంగా ఉంటుంది. నాయకులు గొంత సవరించుకుని కాస్తంత దేశ, ప్రాంతీయ చరిత్ర గురించి నాలుగు మాటలు ఆవేశంగా మాట్లాడటం, దేశ ప్రధాని చెప్పినవన్నీ పాటించి తీరాలని హామీలు తీసుకోవడం వంటివీ జరుగుతుంటాయి. ఇది దాదాపు అనా దిగా వస్తున్నదే. ఈసారి చిత్రమేమంటే పండగ అయి పోగానే ఎవరికి వారు ఏమీ పట్టనట్టుం డటంతో పాటు పతాకాలను నిర్లక్ష్యం చేయవద్దని అధికారులు సందేశం లాంటి హెచ్చరికా చేయడం.
ఎంతో దేశభక్తితో పతాకాలు పెద్ద పెద్ద కర్రలకు కట్టి చిన్న చిన్నవాటిని దండలుగా వీధంగా కట్టి నానా హడావుడి చేసే వారంతా అప్పటికి చూపే పార్టీ నాయకులపట్ల అభిమానం, సరదా ఆ మర్నాటితో ఆగి పోకూడదన్నది ఇప్పటి నేతల ప్రకటన సారాంశం. అంతా అయిపోయింది ఇక ఇళ్లకు పదండర్రా అను కుని జెండాలను వీలయినంత నిర్లక్ష్యంగా పడేయడం పరిపాటి. అలా చేయడం తప్పే. దేశ నాయకుల పట్ల ఏమాత్రం గౌరవం ప్రదర్శించకపోవడమే. అసలు జాతీయపతాకాన్ని అగౌరవపరచడమే. కానీ మొన్నీమధ్య దాకా ఈ సంగతిని బడి పిల్లలకు, కాలేజీ కుర్రాళ్లు గట్టిగా చెప్పిన నాయకులు లేరు. అందుకే మొన్నటి దాకా చాలా కాలం నుంచే పెద్ద పెద్ద పతాకాలు తప్ప చిన్నవి, దుకాణాల్లో సూదితో పాటు కొను క్కునవన్నీ నోటు బుక్కుల్లోకో, కాలవల్లోకో వెళిపోవడం జరిగింది.
నోటుబుక్కులో పెట్టుకుని ఇది నాది అంటూ క్లాసుల్లో గొడవపడే పిల్లలూ ఉంటారు. అదో సరదా వారికి. అదీ తాత్కాలికమే. రెండు మూడు రోజుల తర్వాత అవీ వాటిస్థానం నుంచి జారిపోతాయి. ఎక్కడో పారేసు కుంటారు. కానీ ఇపుడు అలా జరగడానికి ఏమాత్రం వీల్లేదని రాజకీయ నాయకులు గట్టిగా చెబు తున్నారు. బడిలో, ఆఫీసుల్లో, ఇళ్లమీదా ఎగరేసుకున్న పెద్ద పెద్ద జెండాలు మాత్రం జాగ్రత్తగా బట్టలు మడత పెట్టి నట్టు చేసి ఇంట్లో, ఆఫీసుల్లో జాగ్రత్త చేయమని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఇది జాతీయ పతాకాన్ని గౌరవించడంలో భాగం. పాటించడం ఆరోగ్యకరం. జాతీయ నాయకులను ముఖ్యంగా స్వాతం త్య్రోదమ్యంలో ప్రాణాలు అర్పించిన దేశభక్తుల పట్ల అపార గౌరవం ప్రకటించినట్లే. ఆలోచిం చండి.