భారత ఫుట్‌బాల్ సమాఖ్య త్రిసభ్య కమిటీ రద్దు
posted on Aug 22, 2022 @ 5:43PM
భారత్ ఫుట్‌బాల్ సమాఖ్య ఏఐఎఫ్ఎఫ్ పై ఫీఫా నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక చర్యకు ఉపక్రమించింది. ఏఐఎఫ్ఎఫ్ రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణకుగానూ ఈ ఏడాది మే నెలలో నియమించిన త్రిసభ్య పాలనా కమిటీని రద్దు చేసింది. నిషేధం ఎత్తివేతకు ఫీఫా సూచించిన కీలక ప్రమాణాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ తెలిపింది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ సారధ్యంలోని పాలనా యంత్రాంగం ఏఐఎఫ్ఎఫ్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.
ఏ దేశంలోనైనా ఫుట్‌బాల్ కార్యక్రమాలను ఆయా సమాఖ్యలు స్వతంత్రంగా నిర్వహించుకోవాలని ఫీఫా కోరుకుంటుంది. ప్రభుత్వాలు, కోర్టులు తృతీయ పక్షం జోక్యాన్ని అస్సలు ఫీఫా అంగీకరించదు. కానీ ఫిఫా నిబంధనల గురించి స్పష్టంగా తెలిసినప్పటికీ భారత సమాఖ్య నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ వచ్చిం ది. 2020 డిసెంబరులోనే అధ్యక్ష ఎన్నికలు జరగలేదు. అప్పటికే మూడు పర్యాయాలు అధ్యక్షునిగా ఉన్న ప్రఫుల్ పటేల్.. జాతీయ క్రీడాబిల్లు నిబంధన ప్రకారం ఇక ఆ పదవిలో కొనసాగేం దుకు ఎంత మాత్రం వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
సమాఖ్య వ్యవహారాల పర్యవేక్షణకు జస్టిస్ దవే నేతృత్వంలో సుప్రీం కోర్టు త్రిసభ్య కార్యనిర్వాహక కమిటీ (సీఓఏ)ని ఏర్పాటు చేసింది. ఈ పరిణా మాలను గమనిస్తున్న ఫీఫా కొంతకాలంగా పరిస్థితులు మారకపోవడంతో వేటు వేసింది.
ఇదిలాఉండగా, ఈ నెల 28న జరగాల్సిన ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల తేదీని వారం రోజులు పొడిగిస్తున్నట్టు సుప్రీం తెలిపింది. ఓటర్ల జాబితాలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 36 మంది సభ్యులు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. కాగా విచారణ సందర్భంగా సీవోఏ తరపున న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణన్ హాజరయ్యారు. ఏఐఎఫ్ఎఫ్ మధ్యంతర ఆడిట్ రిపోర్టును అంద జేశారు. తుది నివేది కను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని వెల్లడించింది. కాగా సుప్రీంకోర్ట్ జారీ చేసిన ఈ ఆదేశాలు ఏఐఎఫ్ఎఫ్‌పై ఫిఫా నిషేధం ఎత్తివేత దిశగా బాటలు వేయనుంది. ఫిఫా నిర్ణయంతో ఇప్పటికే జాతీయ జట్టుతో పాటు క్లబ్ జట్లపై ప్రతికూల ప్రభావం పడుతున్న విషయం తెలిసిందే.