ప్రత్యూష బెనర్జీ కేసులో ట్విస్ట్.. ప్రియుడిపై చార్జీషీటు
posted on Jul 21, 2016 @ 12:47PM
బాలిక వధు సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు పెద్ద కలకలం రేపిన ఈ కేసు కొన్ని రోజులుగా సైలెంట్ అయింది. అయితే ఇప్పుడు మళ్లీ తాజాగా ఈకేసులో కొత్త ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. ప్రియుడు రాహుల్ రాజ్ సింగే ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని పోలీసులు అభియోగాలు మోపారు. అంతేకాదు ఆమెపై హింసకు పాల్పడినట్లుగా కూడా రాహుల్ పై పోలీసులు అభియోగాలు మోపారు. దీనికి సంబంధించిన 101 పేజీల చార్జీషీటును కోర్టులో దాఖలు చేశారు. దీంతో ఈ నెల 30వ తేదీన అతను కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది.
కాగా ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రత్యూష తల్లి రాహులే తమ కూతురు ఆత్మహత్య చేసుకునేలా చేశాడని.. అతనికి బెయిల్ ఇవ్వద్దని.. కఠినంగా శిక్షించాలని కోరారు. కాని కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడంతో అతను ప్రస్తుతం బయటే ఉన్నాడు. మరి 30వ తేదీన రాహుల్ కోర్టు ముందు హాజరవుతాడో.. లేదో చూడాలి..?