దారుణం.. కుక్క పిల్లల్ని కాల్చి చంపారు...
posted on Jul 21, 2016 @ 2:20PM
మనుషుల్లో కర్కసత్వం పెరిగిపోతుంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చూస్తే చాలు. ఇటీవలే తమిళనాడుకు చెందిన మెడికో కుక్కని టెర్రస్ పై నుండి పడేసి తన పైశాచికాన్ని చూపించాడు. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే వెలుగుచూసింది హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్‌లో. వివరాల ప్రకారం.. ముషీరాబాద్లోని పఠాన్ బస్తీలో కొందరు మూడు కుక్క పిల్లలను తాళ్లు కట్టి మంటల్లో వేసి పైశాచిక ఆనందం పొందారు. మళ్లీ వారేదో గొప్ప పని చేస్తున్నట్టు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే ఈ దారుణాన్ని చూసిన వారు ఊరుకుంటారా.. వారిపై తిట్ల వర్షం కురిపించారు. ఇంక ఈ దృశ్యాలను చూసిన పీపుల్స్ ఫర్ యానిమల్స్ ప్రతినిధి, న్యాయవాది శ్రేయ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. ఈ ఘటనకు సంబంధించి 8మంది మైనర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. కేవలం ఆకతాయితనంతోనే కుక్కలను దహనం చేసినట్లు పోలీసులు నిర్థారించారు. నిందితులను జువైనల్ కోర్టుకు తరలించగా రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.