తరుణ్‌ తేజ్‌పాల్ అరెస్ట్...బెయిల్

 

 

 

లైగింక వేధింపులకు పాల్పడి నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్‌తేజ్‌పాల్‌ను గోవా పోలీసులు అరెస్టు చేశారు.  తేజ్‌పాల్ మధ్యంతర బెయిల్ ముగియగానే పోలీసులు రంగంలోకి ఆయనను అరెస్టు చేశారు. వెంటనే తేజ్‌పాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా ఈరోజు అరెస్టు చేయవద్దని, రేపటి వరకు ఆగాలని కోర్టు తెలిపింది. ఎందుకంటే తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్‌పై రేపు  విచారణ జరగనుంది. అంతవరకు ఆగాలని కోర్టు గోవా పోలీసులకు ఆదేశించింది.

 

సహోద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూన్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ గురువారం పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు నాన్ బెయిల్‌బుల్ అరెస్టు వారెంట్ జారీ చేసీంది. దీంతో తేజ్‌పాల్ శుక్రవారం ఉదయం కోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత పూచికత్తుపై కోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది.