ఆంబులెన్స్‌కు దారిచ్చిన ప్రధాని కాన్వాయ్
posted on Sep 30, 2022 @ 5:06PM
ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ శుక్రవారం మానవీయ కోణాన్ని ప్రదర్శించింది. ప్రధాని శుక్రవారం గాంధీ నగర్ రాజభవన్ కు వెళుతూండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
గుజరాత్‌లో రెండురోజుల పర్యటన లో భాగంగా రెండవరోజు శుక్రవారం ప్రధాని మోదీ గాంధీనగర్-ముంబై మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముగించు కుని గాంధీనగర్ వెళుతూండగా అహ్మదాబాద్-గాంధీనగర్ హైవేలో కొంత సమయం తర్వాత ప్రధాని కాన్వాయ్ ఎడమవేపు నెమ్మదిగా వెళ్లింది. అదే సమయంలో వెళుతోన్న ఒక అంబులెన్స్ కి దారి ఇచ్చా రని బీజేపీ నాయకులు చెప్పారు. ఈ సంఘటన ప్రధాని గాంధీనగర్ రాజ్భవన కు వెళుతూండగా జరిగింది.
ఎక్కడయినా ఏ నగరం, పట్టణంలోనైనా సరే వాహనదారులు తమకు ఎదురుగా వస్తున్న, లేక వెనక వస్తు న్న ఆంబులెన్స్ కు దారి ఇవ్వడం దేశ పౌరుని బాధ్యతగా పాటించాలన్నది మోదీ తెలియజేశారు. కాగా, సాయిం త్రం ప్రధాని బనస్కంత జిల్లాలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు, అనంతరం ఆయన ప్రముఖ అంబాజీ దేవాలయాన్ని సందర్శిస్తారని బిజేపీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.