రజకుల వినూత్న నిరసన!
posted on Sep 30, 2022 @ 5:53PM
జీతాలు పెంచమని, పెన్షన్ పథకం సరిగా అమలుచేయాలనో, ఉద్యోగాల కోసమో వివిధ రకాల నిరసన ప్రదర్శనలు చూస్తూనే ఉంటాం. డిమాండ్లు రాసిన ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర, అసెంబ్లీ దగ్గరా ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తుంటారు. కానీ రజకుల నిరసన ప్రదర్శన అంత హడావుడి లేకుండా మంచి ఎఫెక్టివ్‌గా చేపట్టారు.
డిమాండ్ల సాధనకు అసెంబ్లీ ఆవరణలోకి, ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్లకార్డులతో, గొంతు చించుకుంటూ నినాదాలు చేస్తూ, ప్రభుత్వాన్ని తిడుతూ జనం దూసుకుపోతుంటారు. అందుకు ప్రజల, మీడియా మద్ద తూ లభిస్తుం టుంది. నిరసనకు ఒక ప్రత్యేక పద్ధతి అంటూ ఉండాలన్న నియమం పెద్దగా ఎవ్వరూ పాటించరు. తోచినవిధంగా నిరసన ప్రదర్శిస్తుంటారు. ఈరోజుల్లో మరీ ఈ ధోరణి ఎక్కువయింది. ప్రభు త్వం ఉన్నది ప్రజా సేవ చేయడానికి తప్ప ఓట్లు వేయించుకుని ప్రశాంతంగా ఉండడానికి కాదన్న ఆగ్ర హంతో రెచ్చిపోతుంటారు. అన్నివర్గాల సమస్యలూ పరిష్కరించడానికే ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, మం త్రులూ అంతా ఉన్నది. చిన్నపాటి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు చిన్నపాటి సమస్యల పరిష్కారానికి పూనుకోవాలి. అంతేగాని తోచిన విధంగా వ్యవహరిస్తే ప్రజలు ఆగ్రహించకపోరు.
కర్నూలు లో రజకులకు కోపం వచ్చింది. వాళ్లకి ఎంతో సహకరిస్తున్న గాడిదలను కార్పోరేషన్ సిబ్బంది లారీ లకు ఎక్కించి ఊరు బయట వదిలేశారు. పట్టణంలో ట్రాఫిక్ కి గాడిదలు అంతరాయం కలిగిస్తున్నా యని, నిత్యం వాహనదారులు రోడ్లమీద తిరుగుతున్న గాడిదలతో నానా ఇబ్బందీ పడుతున్నారని మున్సి పల్ సిబ్బంది వాదన. అవి లేకుంటే మా పనులు సాగవు, వాటిమీదే తమ జీవనం సాగుతోంది అంటూ రజకులు రెచ్చిపోయారు. వాటిని ఒక్క మాటా తమకు చెప్పకుండా బయటికి తరలించడం మీద కోపగించి, గాడిదలతోనే కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలో సిబ్బంది ఈ హఠాత్పరిణామానికి ఖంగారు పడ్డారు. గాడిదలను తెప్పిస్తాంగాని వాటిని మీ ఇళ్లవద్దనే కట్టేసుకుంటేనే అనుమతిస్తామన్నారు కార్పోరేషన్ వారు.
ఏమైనప్పటికీ రజకుల వినూత్న నిరసన, రేపో మాపో అవసరం వస్తే అన్ని వృత్తుల వారూ ఏదో రకంగా వారి పద్ధతిలో ఇలా నిరసనకు దిగడానికి మార్గదర్శిగా ఈ గాడిదల నిరసనని పేర్కొనాలి.