మోదీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్
posted on Mar 21, 2014 @ 8:12PM
పవర్ పవన్ కళ్యాణ్ ఈరోజు అహ్మదాబాద్‌లోని గాంధీనగర్‌లో బీజేపీ కార్యాలయంలో నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. మోదీతో 40 నిముషాల పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...మోదీకి మద్దతు తెలపడం కోసమే అహ్మదాబాద్ వచ్చానని అన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఎవరూ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్న విబేధాలను గుర్తించలేకపోయారని, ఇదే విషయాన్ని మోదీ కూడా చెప్పారని పవన్ పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయితే రాష్ట్రానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో కూడా చెప్పానని అన్నారు. తెలుగు ప్రజల్లో ఐక్యత లేకపోతే దేశ సమగ్రతకు భంగం కలుగుతుందని మోదీ చెప్పినట్లు ఆయన తెలిపారు. సూరత్‌లో ఉన్న తెలుగువారంతా ఐక్యతగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్న తెలుగువారిని, ఎందుకు ఐక్యంగా ఉంచలేకపోయారని మోదీ ప్రశ్నించారని పవన్ తెలిపారు. పదవులు కంటే రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరూ బాగుండాలని కోరుతూ మోదీని కలవడం జరిగిందని పవన్ స్పష్టం చేశారు.