పవన్ పుస్తకం.. రాజకీయాలు ఎలా ఉండాలి?
posted on Sep 13, 2016 @ 3:29PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుస్తకం రాస్తున్నారా..? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. 'జనం మనం' పేరుతో ఆయన ఓ పుస్తకం రాస్తున్నారట. ఇంతకీ ఆ పుసక్తంలో పవన్ కళ్యాణ్ ఏ అంశాలు ప్రస్తావిస్తారనుకుంటున్నారా.. రాజకీయాలు ఎలా ఉండాలి? అన్న అంశాన్ని ఆయన ప్రస్తావించనున్నారట. ఈ పుసక్తంలోనే తన రాజకీయ కార్యాచరణపై పవన్ స్పష్టత ఇవ్వనున్నారు. జనం మనం పుస్తకం ట్యాగ్‌లైన్‌గా ‘మార్పు కోసం యుద్ధం’ అని పెట్టనున్నారు. మరో రెండు నెలల్లో ఈ పుస్తకం విడుదల కానుంది.
ఇదిలా ఉండగా.. జనసేన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉద్దేశ్యంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 'నేను-మనం-జనం' (మార్పుకోసం యుద్ధం' అనే పుస్తకం రాస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఒకరకంగా ఇది పార్టీ పెట్టటం వెనుక ఆయనకు ఉన్న ఉద్దేశ్యాన్ని , ప్రేరేపించిన పరిస్థితులను,చెయ్యాలనుకున్న కార్యక్రమాలను, సాధించాలనుకుంటున్న ఆశయాల్ని ప్రతిబింబించేదిగా ఉంటుందని అంటున్నారు. ఇంతకుముందు ప్రచురించిన 'ఇజమ్' పుస్తకం కంటే భిన్నంగా, సరళంగా, సూటిగా ఉండాలనే ప్రయత్నం తో ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ప్రచురిస్తున్నారు.