నన్ను కాదు మోడీని అడగండి...
posted on Sep 13, 2016 @ 4:30PM
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో చికెన్ గున్యా, డెంగీ వ్యాధులతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు చికున్ గున్యా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ పై పలువురు ట్విట్టర్ల ద్వారా ట్వీట్లు చేస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ వాటిపై స్పందించి ఎప్పటిలాగే మోడీపై విమర్శలు చేశారు. ఆ వ్యాధుల అంశాన్ని గురించి ప్రధానిని అడగండి.. ఢిల్లీలో సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులకు ఎలాంటి అధికారాలు లేవు..తమకు రాసుకునేందుకు పెన్ను కొనుక్కునే అధికారం కూడా లేదని అన్నారు అన్నారు. అంతేకాదు లెఫ్టినెంట్ గవర్నర్‌తో పాటు మోదీ రాష్ట్రంలోని అన్ని అధికారాలను వారి గుప్పిట్లోనే ఉంచుకున్నారని ఆయన పేర్కొన్నారు.
కాగా ప్రస్తుతం కేజ్రీవాల్ గొంతు సర్జరీ కోసం బెంగళూరుకి వెళ్లారు. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా ఆ రాష్ట్రంలో లేరు. మరోవైపు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ గోవాలో పర్యటిస్తున్నారు. రానున్న పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొనేందుకు అవసరమైన సన్నాహకాల్లో ఆయన ఉన్నారు. ఇలా ప్రతినిధులందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటే ఇంక ప్రజల గురించి పట్టించుకేవాళ్లు ఎవరుంటారు. ఇలా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప..