ఇన్ స్టా గ్రాంలోకి పవన్ గ్రాండ్ ఎంట్రీ
posted on Jul 5, 2023 @ 1:34PM
ఇప్పుడు దాదాపు సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. తమ వ్యక్తిగత విషయాలు, రాజకీయ కార్యక్రమాలు, సినీ వార్తలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. ముఖ్యంగా కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్ హవా కొనసాగుతోంది. అందులో తమ లేటెస్ట్ ఫోటోలు, అప్డేట్స్ తో సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఉన్న పవన్.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అలా ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టారో లేదో ఆరు గంటల్లోనే ఒక మిలియన్ ఫాలోవర్లు వచ్చారు.
పైగా ఆయన ఇంకా ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. కేవలం ఆయన ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారనే అప్డేట్ తో ఫ్యాన్స్ పోటీపడి ఫాలో అవుతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ తరహాలోనే పవన్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో "ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..జై హింద్!" అని రాసుకున్నారు.