చదువు వద్దు.. పెళ్లి ముద్దు..
posted on Mar 31, 2021 @ 11:38AM
ఆ అమ్మాయికి 13 ఏళ్ళు. పడవ తరగతి చదువుతుంది. అమ్మాయి చదువుకుంటానంది .. తల్లిదండ్రులు పెళ్లి చేస్తమన్నారు. బాలికకు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. అయితే బాలిక చదువుకుంటున్న తనకు ఎందుకు పెళ్లిచేస్తున్నారని తల్లిదండ్రులను నిలదీసి, ధైర్యంగా స్థానికంగా ఉన్న మహిళా పోలీసుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
బాలిక సచివాలయంలోని మహిళా పోలీసుకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈవోపీఆర్డీ, రెవెన్యూ, గ్రామ సెక్రటరీ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. బాలిక వయస్సు ఆధార్ నంబరులో గుర్తించి తల్లిదండ్రులను మందలించగా ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుసుకున్న అధికారులు వారికీ కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లి ప్రయత్నం నిలుపుదల చేయించారు. బాలిక చదువుకునేందుకు ఆదుకుంటామని, సంక్షేమ పథకాలూ అందేలా చర్యలు తీసుకుంటామని ఈవోపీఆర్డీ తెలిపారు. ఈ ఘటన తూర్పు గోదావరి ఎటపాక మండలం గౌరీదేవిపేట గ్రామంలో జరిగింది.