నోరు జారిన ఖుష్బూ.. బీజేపీ పరువు గోవిందా..
posted on Mar 31, 2021 @ 11:34AM
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఖుష్బూ దూసుకుపోతున్నారు. బీజేపీకే మీ ఓటు అంటూ ఊదరగొడుతున్నారు. పనిలో పనిగా.. ప్రజా సమస్యలపైనా ఫైర్ఱ అవుతున్నారు. థౌజెండ్‌లైట్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఖుష్బూ .. స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేను దుమ్మి దులిపేశారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలను గాలికొదిలేశాడని మండిపడ్డారు. ఖుష్బూ ఇంతగా తిడుతుంటే.. అక్కడున్న ప్రజలంతా తెగ నవ్వుతున్నారు. ఖుష్బూ వెంట ఉన్న బీజేపీ నేతలు మేడమ్ వద్దు మేడమ్.. ఆపండి మేడమ్ అంటూ తెగ అరుస్తున్నారు.
ఇంతకీ అక్కడ జరిగిన పొరబాటు ఏంటంటే... ఖుష్బూ తిట్టిన గత ఎమ్మెల్యే.. ప్రస్తుతం ఆమె పక్కనే ఉన్నారు. సదరు ఎమ్మెల్యే డీఎంకేకు రాజీనామా చేసి ఇటీవలే బీజేపీలో చేరారు. ఖుష్బూతో కలిసి.. థౌజెండ్‌లైట్స్‌లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఖుష్బూ తిట్టే సమయంలోనూ ఆయన ఆమె పక్కనే ఉన్నారు. దీంతో.. జనమంతా నవ్వుకున్నారు. వెనకాల ఉన్న బీజేపీ నేతలు ఆ పాత ఎమ్మెల్యే సెల్వం మీ పక్కనే ఉన్నారని చెప్పడంతే ఖుష్బూ సర్దుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడున్న కార్యకర్తలతా పెద్దపెట్టున నవ్వుతూ కేకలేశారు. దీంతో ఖుష్బూ కూడా కాస్త ఇబ్బంది పడ్డారు.