రైతు కంట కన్నీళ్లు.. ఇదేనా మీ పరిపాలన?
posted on Mar 31, 2021 @ 11:50AM
'మీ బతుకులు చెడ.. ఇదేనా మీ పరిపాలన' అంటూ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు మాజీ మంత్రి దేవినేని ఉమా. రైతులు సమస్యలతో కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి కనిపించడం లేదా? అంటూ నిలదీశారు. మంత్రులు ధాన్యాన్ని కొనుగులు చేయకుండా బూతులు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ఈ బూతుల మంత్రులు టీవీలో వస్తుంటే ప్రజలు చిదరించుకుంటున్నారని తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంకటగిరి నియోజకవర్గం, డక్కిలి మండలం, వెలికల్లు గ్రామ రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. 75 కిలోల వడ్ల బస్తాని 80 కిలోలు కడుతున్నారని.. కళ్ళ ముందు దోపిడీ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చేతకాని ప్రభుత్వం, అసమర్ధ ప్రభుత్వమని ఆయన విమర్శించారు. ‘‘మీ బ్రతుకులు చెడ ఇదేనా మీ పరిపాలన’’ అంటూ దుయ్యబట్టారు దేవినేని ఉమా.