పరాగ్, రాపిడో డ్రైవర్ కాదు.. షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్!
posted on Aug 18, 2022 @ 10:53AM
అతను రాపిడో రైడర్. పేరు పరాగ్. ఎప్పుడూ బిజీగా ఉండే బెంగళూరు అతని నివాసం. కావడానకి అత ను బైక్ టాక్సీ డ్రైవర్ గా అన్ని ప్రాంతాలకు అటు నుంచి ఇటు జనాన్ని చేరవేయడం ఉద్యోగంలానే చేస్తున్నాడు. కానీ అతనిలో కళాకారుడు.. డైరెక్టర్ బయటికి వచ్చేడు. వాస్తవానికి అతనో వీడియోగ్రాఫర్ కూడాను. అందువల్ల ఎంతో ఆసక్తితో జనాన్ని ఆకట్టుకునే చిత్రాలు తీయాలన్న తపన సహజంగానే అతనికి ఉంది.
పరాగ్, రాపిడో రైడర్‌గా పనిచేస్తునే ఒక చైనా కంపెనీకి వీడియో సిరీస్‌లో పనిచేస్తుండేవాడు. కానీ చైనా యాప్స్ నిషేధంచడంతో అతను ఆ కంపెనీవారి నుంచి బయటపడి స్వంతగా ఏదన్నా చేయాలన్న ఆలో చనలో పడ్డాడు. కోవిడ్-19 భయాందోళనలో బెంగళూరు పట్టణ ప్రజలంతా బికు బికు మంటూంటే ఇతను మా త్రం ధైర్యం చేసి కెమెరా పట్టుకుని సిటీ అంతా తిరుగుతూండేవాడు. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్‌లు తీస్తుండేవాడు. అతనికి అలా చాలామంది ఆ ఫీల్డ్ కి సంబంధించిన సంబంధాలు ఏర్పడ్డాయి. చేతిలో కెమెరా కూడా ఉండడంతో ఫిల్మ్ తీయడం మరింత సులువు కావడంతో తన ఆలోచనలకు తగ్గట్టుగా మంచి థీమ్‌తో చక్కని షార్ట్ ఫిల్మ్‌లు తీసి తెలిసినవారికి, ఆ ఆసక్తి ఉన్న పెద్దవారికి చూపిం చేవాడు. ఈ ప్రయాణంలోనే అతనికి ఒక పెద్ద కంపెనీని సంప్రదించాడు. పెద్ద సిరీస్‌కి ప్లాన్ చేశాడు. అది విజయవం తమైంది. అంతేకాదు, ఏకంగా 15 ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు అందుకున్నాడు.
క్రమేపీ రాపిడో రైడర్ పని నుంచి బయటపడి పూర్తిస్థాయి షార్ట్‌పిల్మ్ డైరెక్టర్ గా అందరి దృష్టినీ ఆకట్టు కున్నాడు. ఇపుడు పరాగ్ బెంగళూరులో చెప్పుకోదగ్గ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్.