పోటీపడిన తల్లీ కొడుకు, పోటీపరీక్షలో ఉత్తీర్ణులయ్యారు
posted on Aug 18, 2022 @ 10:04AM
పిల్లలకి స్కూలు బ్యాగ్, టిఫిన్ బాక్సులు సర్దడంతో, హోంవర్క్ చేయించడంతోనే తల్లలు చాలామంది సగం రోజు గడిపేస్తుంటారు. పిల్లలకు పాఠాలు చెబుతూ తాము చదువుకున్న రోజుల్ని గుర్తుచేసుకునే వారూ ఉన్నారు. కానీ కొడుకుతో పాటు పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు సిద్ధపడటం మాత్రం బిందు చేయగలి గింది.
కేరళ మల్లపురానికి చెందిన బిందు తన కొడుకు వివేక్ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధపడటం అతనికి సహాయం చేయడంతో పాటు ఆమె కూడా ఒక ప్రయత్నం చేసింది. అందుకు ఆమె భర్త కూడా అంగీకరించి తగిన మద్దతునిస్తూ అన్ని ఏర్పట్లూ చేశాడు. అంతే ఇద్దరు తల్లి కొడుకులా కాకుండా పోటీ పరీక్షకు పోటీపడుతున్న విద్యార్ధుల్లా చదివారు.
42 ఏళ్ల బిందు ఎల్ డీసి పరీక్షల్లో 38వ ర్యాంక్ సాధించగా ఆమె కొడుకు 24 ఏళ్ల వివేక్ 92వ ర్యాంక్ సాధిం చాడు. చిత్రమేమంటే ఇద్దరూ కలిసే చదువుకున్నారు, ఇద్దరూ ఒకేచోట ట్యూషన్‌కీ వెళ్లారు. కానీ ఆమెకు చదువు పట్ల శ్రద్ధ, ఉద్యోగం ఎలాగైనా సాధించాలన్న పట్టుదల ముందు తన కొడుకు శ్రమ గొప్ప విజయా నికి సాధించలేకపోయింది.
కానీ తల్లి తల్లే.. తన కొడుకు నుంచే స్పూర్తి పొందానని, అతను శ్రద్ధగా చదువు తుండడంతో తనకూ ఆసక్తి రెండింతలు పెరిగిందని బిందు అనడం గమనార్హం. వాస్తవానికి ఈ పరీక్షలు రాయడానికి 40 ఏళ్లు పరిమితి. కానీ మింట్ ఉద్యోగానికి ఈ అర్హతను మూడేళ్లు పెంచారు. ఈ కారణంగా బిందు లాంటి ఆసక్తిగలవారికి ఇది మంచి అవకాశంగా మారింది.
తల్లీ కొడుకూ ఇద్దరూ సర్వీస్ కమిషన్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. ఇక ఉద్యోగాల గురించి వేచి ఉన్నారు. ఇద్ద రికీ ఒకే చోట.. ఒకే పట్టణంలో వేస్తారా.. వేరే వేరే ప్రాంతాల్లో వేస్తారా అన్నది చూడాలి. ఇదిలా ఉండ గా, ఇలా తల్లీ కొడుకుల జోడి పరీక్షలు రాయడం, ఉత్తీర్ణులు కావడం కర్ణాటకలో చాలా రోజుల తర్వాత గమ నిస్తున్నామని ట్విటర్లలో జనాలు తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరికి అభిమానుల తాకిడి ఎక్కవే అయింది. గుడ్ లక్ బిందూ గారూ.. అంటూ పెద్ద పెద్ద అధికారులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.