ఉగ్రవాదుల ఏరివేతకు నవాజ్ షరీఫ్ ఆదేశం..
posted on Oct 6, 2016 @ 2:25PM
భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్ దాడులకు ప్రస్తుతం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఒకపక్క మా దేశంలో అలాంటి దాడులు జరగలేదని బుకాయిస్తున్న లోపల నిజాన్ని మాత్రం మింగలేక చస్తుంది. అయితే ఇప్పుడు ఉగ్రవాదుల విషయంలో ప్రధాని నవాజ్ షరీఫ్ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ దేశంలో ఉన్న మిలిటెంట్ల ఏరివేతకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆ దేశ సైనికాధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సర్జికల్ దాడుల అంశంపై అఖిల పక్ష పార్టీ సమావేశం ఏర్పాటు చేసిన షరీఫ్ ప్రభుత్వం.. భారత్‌తో సరిహద్దు ఉన్న నాలుగు సమస్మాత్మక రాష్ట్రాల్లో మిలిటెంట్ల ఏరివేతను తీవ్రతరం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మిలిటెంట్ల గ్రూప్‌లను కంట్రోల్ చేస్తే, ఆ రాష్ట్రాల్లో శాంతి భద్రత వ్యవహారం అంశంలో జోక్యం చేసుకునే ప్రసక్తి లేదని ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. మిలిటెంట్ల ఏరివేతకు రాష్ట్రాలు సహకరించని పక్షంలో సైనిక చర్యను తీసుకోవాలని ఐఎస్ఐ డీజీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.