రగులుతున్న పీవోకే ప్రజలు.. ఉగ్రవాద క్యాంపులకు వ్యతిరేకంగా నిరసన
posted on Oct 6, 2016 @ 12:15PM
పీవోకే( పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్) ప్రజలు నిరసనలతో రగులుతుంది. ఇప్పటికే పాకిస్థాన్ ఉగ్రవాదన్ని పోత్సహిస్తుందని.. ఉగ్రవాదులకు ఆసరాగా నిలుస్తుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు కూడా దీనిపై నిరసన గళమెత్తారు. ఉగ్రవాద క్యాంపులకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ అడ్డాగా మారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవోకేలోని ముజఫరాబాద్, కోట్లి, చినారి, మిర్పూర్, గిల్గిట్, నీలమ్ లోయ ప్రాంతాల్లోని ప్రజలు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. ఉగ్ర క్యాంపుల కారణంగా తమ జీవితాలు నరకంగా మారాయని వాళ్లంటున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం, ఆర్మీ బలగాలు ఈ ఉగ్ర క్యాంపులను అణచివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవి తమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వాపోతున్నారు. పీవోకేలోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ సర్జికల్ దాడులు చేయడంతో ఇక్కడి ప్రజలు ఉలిక్కిపడ్డారు. తమ ప్రాంతంలోఉగ్రవాద క్యాంపులు ఉన్నాయన్న విషయం ఈ దాడులతో స్పష్టమైందని భావిస్తున్న ప్రజలు.. వాటిని ఏరివేయాలంటూ ఆందోళనలకు దిగారు.