బీసీసీఐ పై మళ్లీ సుప్రీం ఫైర్...రాత్రికి రాత్రి 400 కోట్లు ఎలా బదిలీ చేస్తారూ..
posted on Oct 6, 2016 @ 3:05PM
బీసీసీఐ పై లోథా కమిటీ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను బీసీసీఐ పట్టించుకోవడం లేదని లోథా కమిటీ సుప్రీం కోర్టును ఇప్పటికే ఆశ్రయించింది. ఇంకా నిధులు మంజూరుపై కూడా లోథా కమిటీ బీసీసీఐ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. ఇప్పుడు దీనిపై మరోసారి బీసీసీఐపై సుప్రీంకోర్టు మండిపడింది. దీనిపై ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. లోధా ప్యానెల్ సిఫారసులను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. లోధా ప్యానెల్ ప్రతిపాదనలు సూచిస్తే వాటిని అమలు చేయడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని సుప్రీం మండిపడింది. దీనిలో భాగంగా బీసీసీఐ అనుబంధ రాష్ట్ర అసోసియేషన్లకు రూ.400 కోట్ల రూపాయల్ని బదిలీ చేయడాన్ని సుప్రీం తప్పుబట్టింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో పారదర్శకత విధానం ఉన్నట్లయితే రాత్రికి రాత్రి 400 కోట్లు ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. అసలు బీసీసీఐలో ఉన్న వారి అర్హత ఏమిటో చెప్పాలంటూ జస్టిస్ ఠాకూర్ ప్రశ్నించారు. అయితే అవి గతేడాది తమ బ్రాడ్‌కాస్టర్స్ ద్వారా వచ్చిన మొత్తమని, వాటిని రాష్ట్ర సంఘాలకు చెల్లించాలని అనుకున్నట్లు బోర్డు వివరణ ఇచ్చింది.