తిట్టిన ఫిలిప్పైన్స్ అధ్యక్షుడిని కలిసిన ఒబామా..
posted on Sep 8, 2016 @ 12:40PM
ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్ట్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎట్టకేలకు కలిశారు. రోడ్రిగో ఒబామాపై నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం రోడ్రిగోతో భేటీని ఒబామా రద్దు చేసుకున్నారు. ఇక దాని తరువాత కళ్లు తెరచిన రోడ్రిగో తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఒబామాకు సారీ చెప్పారు. దీంతో ఒబామా మళ్లీ రోడ్రిగో తో భేటీకి డేట్ ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలో ఈరోజు రోడ్రిగో డ్యుటెర్ట్‌ను ఒబామా కలిశారు. ఇద్దరు నేతలు కొంతసేపు మాట్లాడుకున్నట్లు ఫిలిప్పైన్స్ విదేశాంగ కార్యదర్శి పర్ఫెక్టో యాసే వెల్లడించారు. లావోస్‌లో జరుగుతున్న ఏషియాన్ సమావేశంలో అన్ని దేశాల నేతల డిన్నర్‌కు ముందు ఈ సమావేశం జరిగినట్లు ఆయన చెప్పారు. డిన్నర్‌కు ముందు వెయిటింగ్ రూమ్‌లో వాళ్లు కలిశారని, ఆ రూమ్ నుంచి చివరిగా బయటకు వచ్చారని తెలిపారు. అయితే ఇద్దరి మధ్య ఎంతసేపు చర్చ జరిగిందన్నదని తనకు తెలియదని పర్ఫెక్టో అన్నారు.