నర్సరీలో పొరపాటు.. తప్పిన కంటిప్రమాదం!
posted on Oct 20, 2022 @ 9:59AM
పిల్లల్ని నర్సరీల్లో చేర్చడం ఈరోజుల్లో పరిపాటి. తల్లి ఉద్యోగరీత్యానో, పనుల ఒత్తిడివల్లనో సమయానికి పిల్లల్లి చూసుకోలేని పరిస్థితుల్లోనూ నర్సరీలో చేరుస్తున్నారు. వారికి చిన్నపాటి ఆటపాటలతో సరదాగా అక్కడివారు జాగ్రతగానూ చూసుకుంటుంటారు. అలాగని వదిలేసి ధైర్యంగా తల్లులు ఉండలేరు. ఏదో ఒక భయం వెన్నాడుతూనే ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టు, ఇంట్లోవారు కనిపెట్టుకున్నట్టు అక్కడ కుదరదు గదా. చాలామంది పిల్లల్లో మన పిల్లవాడు! కొట్టుకుంటారు, గిచ్చుకుంటారు, ఏడుస్తారు, నానా రభసా ఉంటుందక్కడ. నర్సరీ క్లాసులు చూసుకునే టీచర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి పొర పాటు కూడా పిల్లలకు ప్రమాదకరంగా మారవచ్చు. ఇదుగో యార్క్‌షైర్‌లో అలాంటి చిన్నప్రమాదమే జరిగింది.
ఏడిది పిల్లాడు జాక్. అతన్ని తన తల్లి దగ్గర్లోని ఒక నర్సరీలో చేర్చింది. వారు నిజానికి బాగానే చూసు కుంటూండేవారు. మొన్ననీ ఒక నర్సు చేసిన తప్పిదంతో పిల్లాడికి దాదాపు కన్నుపోయే ప్రమాదం వచ్చిపడింది. అందరూ ఆస్పత్రికి పరిగెత్తారు. అదృష్టవశాత్తూ కంటికి ఏమీ కాలేదు. ఫస్ట్‌స్టెప్స్ అనే నర్సరీలో పిల్లలంతా ఆడుతున్నారు. అక్కడ వాళ్ల సంరక్షకురాలు చక్కగా గోళ్ల అందం చూసుకుం టోంది. ఈమధ్య నకిలీ గోళ్లు కూడా వచ్చాయి. వాటిని పెట్టుకుంటోంది. అంతలో ఎటునించి వెళ్లాడో జాక్ ఆమె దగ్గరికి వెళ్లాడు. ఆమె తయారుచేసుకున్న జిగురులాంటి పదార్ధం గిన్నెలో అమాంతం చేయి పెట్టాడు. అది చూసి ఆ నర్సు వాడి చెయ్యి పట్టుకునేలోగానే వాడు లాగేసరికి అది కళ్లకి తగిలి కుడికన్ను వెంటనే ఎర్రగా అయి వాచింది. ఈమె భయంతో ఒణికింది. ఓర్నాయనో ఏదో అయ్యిందిరా అని. ఒక్క పొలికేక పెట్టింది.
వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసికెళితే పరీక్షచేసిన డాక్టర్లు మరేం ఫరవాలేదు కంటికేమీ కాలేదని చెప్పారు. రెండు రోజులు జాగ్రత్తగా చూసుకోమని జాక్ తల్లిదండ్రులకు చెప్పారు. ఆ నర్సరీ స్కూలు యాజమాన్యం ఆ నర్సుని తిట్టి బయటకి పంపేసింది. అంచేత.. పిల్లల్ని నర్సరీకి పంపామని మరీ ధైర్యం గా ఉండకండి.. అక్కడి పరిస్థితులు వాకబు చేస్తుండండి.