ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీయే!
posted on Sep 21, 2022 @ 12:27PM
కొందరికి శత్రువులు, మిత్రులు, వీరాభిమానుల కంటే భక్తగణమే ఎక్కువ ఉంటారు. అదుగో అలాంటి మహామనిషి నందమూరి తారకరామారావు. ఎన్‌టిఆర్ అంటూ వీరాభిమానంతో పిలుచుకునే తారక రాముడు సినీనటునిగా, రాజకీయనాయకునిగా, మరీ ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రిగానూ ప్రజల హృద యాల్లో నిలిచిన వ్యక్తి. ఆయనంటే ఇష్టపడని వారు చాలా అరుదు. ఆయన పేరుతో హెల్త్ యూని వర్సీటీ ఏర్పాటు అయినపుడు సంతోషించని వారులేరు. అది ఆయన్ను హృదయపూర్వకంగా గౌరవించు కోవడ మే అన్నారంతా. ఇపుడు ఆ యూనివర్సిటీ పేరు మార్చడం విషయంలో అన్ని పార్టీలవారూ ప్రబుత్వా న్ని ప్రశ్నిస్తున్నారు. హెల్త్ యూనివర్సిటీ అనేది ఎన్టీఆర్ కల అని అందువల్లనే ఆయన పేరిటనే స్థాపించడం జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
ఆయనంటే పార్టీలు, కులమత వర్గాలతో సంబంధంలేకుండా ప్రేమించేవారి శాతమే ఎక్కువ. ప్రాంతీయా భిమానానికి ప్రతినిధిగా పార్టీ పెట్టి అనతికాలంలో ముఖ్యమంత్రి అయి, అటు కేంద్ర రాజకీయాల్లోనూ ప్రభావం చూపిన ఘనుడు ఎన్టీ ఆర్. ఆయన మరణం తెలుగు జాతికి దురదృష్టమంది యావత్ లోకం. అందులో ఏమాత్రం సందేహం లేదన్నారు అన్నివర్గాలవారూ, అన్ని పార్టీలవారూ. అదీ ఎన్టీఆర్ అంటే.
వర్సిటీ పేరు మార్చడం సబబు కాదని అంటూ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేశారు. వర్సిటీకి ఆయన పేరు మార్చాలన్నది సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం చాలా బాధగా ఉంది. ఎన్టీఆర్ పేరు తొలగించ డం సరైన నిర్ణయం కారని ఆయన అన్నారు.
ఆయనే కాదు, ట్విట్టర్ ద్వారా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా స్పందించడం గమనార్హం. ఆయన కావడానికి వైసీపీకి చెందనవారయినప్పటికీ ఎన్టీఆర్ విషయంలో తన మనసును చంపుకోలేక పోయారు. అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌కు విన్నవించారు. మీరు ఎంతో పెద్ద మనసుతో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకైన నందమూరి తారకరామారావు గారి పేరుతో జిల్లా ఏర్పాటు చేసి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వని గుర్తింపునిచ్చి స్ఫూర్తి దాయకంగా నిలిచారు. నిజంగా అది ఎంతో చారిత్రాత్మకం..విప్లవాత్మకం..అదే జిల్లాలో ఎన్టీఆర్ గారి చొరవ తోనే ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కారణజన్ముడైన ఆ మహనీయుడి పేరే కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని మనఃపూర్వక విజ్ఞప్తి చేస్తున్నానని వల్లభనేని వంశీ ట్విటర్ ద్వారా కోరారు.