నెల్లూరు జిల్లాలో బరితెగించిన వైసీపీ నేతలు
posted on Sep 21, 2022 @ 12:53PM
జానెడు స్థలం ఉన్నా వెయ్యేనుగుల బలంతో ఉంటారు పేద, మధ్యతరగతివారు, అదీ పట్టణ ప్రాం తంలో ఉంటే మరీ ధైర్యంగా ఉంటారు. కానీ అది తమది అంటూ రిజిస్టర్ చేయించుకున్న కాయితాలు ఉంటే సరిపోదు. రోజూ వెళ్లి చూసుకున్నా చాలదు. ఎందుకంటే ఇది భూకబ్జాదారుల కాలం. వాళ్లకి ఊరు, పేరు, కాలం, స్థలం ఎంత అనేదానితో సంబంధం లేదు, చూపు పడిందంటే అది వాళ్లది అయి పోవాలి. అందు కు ఎలాంటి దారుణాలయినా చేసేస్తున్నారు. వారికి చట్టాలు, కోర్టులు, పోలీసులు అంటే బొత్తిగ భయం భక్తీ ఉండదు. దాడి చేయడం ఆక్రమించుకోవడమే తెలుసు.
తాజాగా రాజకీయరంగుపూసుకుని మరీ దాడులకు పాల్పడుతున్నారు. ఏమన్నా అంటే ఫలానా ఆయన మద్దతు ఉందని బాహాటంగానే ప్రకటించి మరీ కాజేస్తున్నారు. అదుగో అలా దాడిచేసిన సంఘటన ఒకటి నెల్లూరు జిల్లాలో జరిగింది.
అబ్దుల్లా అనే ఆయన నెల్లూరుజిల్లా మర్రిపాడు మండలం కృష్నాపురానికి చెందిన రైతు. ఆయనకు మూడు ఎకరాల భూమిఉంది. పొలాన్ని సాగుచేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆమధ్య హఠాత్తుగా కొందరు గూండాలు వచ్చి ఇది మాది, దీన్ని వదిలేయమని దాడి చేశారు. వైసీపీ నేత చింతగుంట రవిరెడ్డి అలా అబ్దుల్లా భూమిని ఆక్రమించేసుకున్నాడు. దీన్ని గురించి అబ్దుల్లా కోర్టుకి వెళ్లాడు. రవిరెడ్డి దురాక్రమణ చేశారని, ఆ భూమి అబ్దుల్లాదేనని కోర్టు తీర్పు కూడా ఇచ్చింది.
కోర్టు తీర్పు ధైర్యంతో అబ్దుల్లా మళ్లీ పొలంపనులకు వెళ్లారు. మళ్లీ రవి గూండాలతో వచ్చి అబ్దుల్లా ను ఆయన కుటుంబసభ్యులపైనా విరుచుకపడి తీవ్రంగా గాయపరిచారు. గాయపడినవారు ఆత్మకూరు ఆస్పత్రిలో చికిత్సకు చేరారు. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ నాయకుడు ఇలా దాడికి పాల్ప డటం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. కాగా తన కుటుంబానికి వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని అబ్దుల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదని, తమకు న్యాయం చేయాలని అబ్దుల్లా వేడుకుంటున్నారు.