ట్రాఫిక్ జామ్ సాక్షిగా ..!
posted on Sep 21, 2022 @ 11:59AM
ప్రేమవ్యవహారాలు ఎప్పుడూ చిత్రంగానే ఉంటాయి. పొలంలో పనిచేస్తూ నాగేస్సర్రావు సావిత్రిని, ప్రబాస్ వర్షంలో త్రిషని, క్లాస్లో రామ్ని నిధిఅగర్వాల్ ప్రేమించేసారు.. ఓ కుర్రాడు చాలారోజుల క్రితమే బెంగు ళూరులో ట్రాఫిక్ జామ్‌లో ఓ అమ్మాయిని అమాంతం ప్రేమించేశాడు!
అదెలా సాధ్యం అని ప్రశ్నించుకోవడం, ఆలోచించి బుర్రపాడుచేసుకోవడం అక్కర్లేదు. ఎందుకంటే అది ప్రేమ.. దానికి ప్లేసు, టైమ్, వ్యక్తులతో పెద్ద సమస్య ఉండదు. అదంతే ఎవర్నియినా ఎవరయినా ఫ్రేమిం చే యచ్చు! రైల్వే జర్నీలో తీరిగ్గా ప్రేమించేయడం, దిగి పాటలు పాడేసుకోవడం సినిమాల్లో చూపుతున్నా రు. అలాంటిది నిజజీవితంలో జరుగుతుందా? అని మామ్మగారు మనవడినో మనవరాలినో తిట్టవచ్చు.. కానీ అదీ జరగనూ వచ్చు! కాల మహిమ.
ట్రాఫిక్‌లో అంతా ఇళ్లకు వెళ్లే సమయంలో విసిగెత్తి ఉంటారు. ఎవరో ఏదో గొడవపడి ట్రాఫిక్ జామ్ అయిన సందర్భంలో ఈ ప్రేమలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతాయా? ఇది ఊహించ లేని వ్యవహారం. కానీ ప్రేమ వ్యవహారాలెప్పుడూ ఇంతే గురూ! అయినా ఈ బెంగుళూరు లవ్‌స్టోరీ తెలుసుకోను కాస్తంత ఇంట్రస్టింగ్‌గానే ఉంటుంది. బెంగుళూరులో ఓ ప్రాంతంలోని సోనీ వరల్డ్ సిగ్నల్స్ దగ్గర ఒక రోజు మామూలుగానే ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాల రొద. అంతలో ఒక కుర్రాడు విసుగ్గా అటూ ఇటూ చూస్తున్నపుడు మెరుపుతీగె లాంటి అమ్మాయి కనపడింది.
ఆమె కూడా అదే ట్రాఫిక్ లో కాస్తంత దూరంలో ఇబ్బందిపడుతోంది. ఆమె అవస్థలు చూసి నవ్వొచ్చిం ది. నవ్వుకున్నాడు. ఆమె విసుగ్గా చూస్తూ అతన్ని చూసింది. ఈ హీరోగారు చాలా సరదాగా అందరినీ చూస్తూ నవ్వుకుంటున్నాడు. ఇంత చిరాకు సమయంలోనూ అంత ఆనందంగా ఎలా ఉన్నాడను కుందిట. అంతే ట్రాఫిక్‌లో ఉన్న సంగతి మర్చిపోయి అతన్నే చూస్తూండిపోయింది. తర్వాత హారన్ల మోత కూడా అంతగా తెలియలేదు. అదే ఫ్రేమ మహత్తు! అతగా డూ అంతే. తర్వాత ఇద్దరిమధ్యా మాటలు కలిశాయి.
ఇక్కడ ట్విస్ట్ ఏమంటే... వాళ్లిద్దరి ప్రేమ వ్యవహారం జరిగి మూడేళ్లయింది. అంటే వారి పెళ్లీ అయింది. కానీ వారు తొలిచూపుల్లో కలిసిన ఆ మహత్తర ప్రదేశం లోని ఎజిపూర ఫ్లైఓవర్ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదుట!