ఏపీలో ఆలయాల రక్షణ గాలిలో దీపమేనా ?
posted on May 4, 2023 @ 5:49PM
ఏమి జరుగుతోంది... ఎందుకిలా జరుగుతోంది...? ఆంధ్ర ప్రదేశ్ లో హిందువులకు రక్షణ కరవవుతోంది, అనే ఆవేదన నిజం అవుతోందా? సర్కార్ ప్రభువుల అండ చూసుకుని అన్యమత ప్రచారం, మత మార్పిడి’ జోరుగా సాగుతున్న విషయం,అద్దంలో ముఖంలా అందరికి కనిపిస్తోంది. రాష్ట్రంలో అనేక గ్రామాలకు గ్రామాలు క్రైస్తవ గ్రామాలుగా బోర్డులు తగిలించుకుంటున్నాయి. క్రైస్తవ గ్రామాల సంఖ్య పెరుగతున్న విషయం పలు సందర్భాలాలో చేర్చకు వస్తూనే వుంది. క్రైస్తవులే లేని గ్రామాల్లో చర్చిలు వెలుస్తున్నాయి. పాస్టర్లు వచ్చి యధేచ్చగా మత ప్రచారం చేస్తున్నారు.నిబంధనలకు వ్యతిరేకంగా సాగుతున్న మత ప్రచారం, మత మార్పిడికి సంబంధించి (బాప్టిజం) క్రతువులు యధేచ్చగా జరుగుతున్నాయి.ఇందుకు సంబంధించి అనేక గ్రామాల్లో ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవదమే లేదు.
అదలా ఉంటే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 250కి పైగా దేవాలయపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. విగ్రహాలను ద్వంసం చేశారు. రధాలను తగుల పెట్టారు. హుండీలను పగ కొట్టి దోచుకున్నారు. ఆభరణాలను దొంగిలించారు. చివరకు పూజారులను హత్య చేశారు. దేవాలయాలలో అన్యమత ప్రార్ధనలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే, హిందువుల మనోభావాలను భయంకంగా దెబ్బతీశారు.ఇక దేవాలయ సంపద దోపిడీ గురించి అయిత చెప్పనే అక్కరలేదు. తిరుమల నుంచి శ్రీశైలం వరకు ప్రధాన హిందూ దేవాలయాలలో ధర్మ విరుద్ద కార్యకలాపాలు యధేచ్చగా సాగుతున్నాయి.
ఇప్పడు శ్రీశైలం క్షేతంలో అదే జరిగింది.కొద్ది రోజుల క్రితం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల ఏడు కొండలపి పై డ్రోన్స్ కలకలం సృష్టించిన విషయం, మరవక ముందే ఇప్పడు తాజగా పవిత్ర శైవ క్షేతం శ్రీశైలంలో ఏకంగా చార్టర్ ఫ్లైట్ కలకలం సృష్టించింది. మల్లన్న ఆలయ పరిసరాల్లో గుర్తు తెలియని చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టిందని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెపుతున్నారు.
శ్రీశైలం క్షేత్రం చుట్టూ చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటికే పలు మార్లు ఆలయ పరిసరాలలో డ్రోన్ చక్కర్లు కొట్టగా.. ఇప్పటి వరకు దాని ఆచూకీని ఆలయ సిబ్బంది కనిపెట్టలేదని చెబుతున్నారు. డ్రోన్ ను చూసిన సిబ్బంది దానిని కిందకు దించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు శ్రీశైలం ఆలయ పరిసరాలతో పాటు.. మల్లన్న ఆలయం చుట్టూ చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టడంతో స్థానికులు, భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి శ్రీశైలం ఆలయ శిఖర ప్రాంతం నో ఫ్లయింగ్ జోన్ అంటే ఆ ప్రాంతంలో విమానాలు ఎగరరాదు, అన్న నిబంధన వుంది. అయితే ఇప్పుడు నో ఫ్లయింగ్ జోన్ ప్రాంతంలో చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టడంతో ఆలయ అధికారులు ఏమి చేయాలో తెలియక, తెలిసినా ఏమీ చేయలేక గుండె బరువును గుండెలోనే దాచుకుంటున్నారు.
అయితే ఇక్కడ ప్రధానంగా వస్తున్న ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తున్నా, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఇంతవరకు కనీసం ఒక్కరంటే ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టుల పెట్టిన వారిని వెంటాడి వేటాడి అరెస్ట్ చేస్తున్న పోలీసు యంత్రాంగం దేవాలయలపై దాడులు చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులను ఎందుకు గుర్తించలేక పోతున్నారు? ఎందుకు అరెస్ట్ చేసి శిక్షించడం లేదు? ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దేవాలయాలు దుండగుల టార్గెట్ ఎందుకయ్యాయి ? అందుకే ఏపీలో ఏమి జరుగుతోంది? ఎందుకిల జరుగుతోంది? అనే భేతాళ ప్రశ్నలు పదే పదే వినిపిస్తున్నాయి. ఏపీలో దేవాలయాల రక్షణ గాలిలో దీపమేనా, అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అవును, ఆయనెవరో అనంట్లుగా, వైసీపీ ప్రభుత్వ చర్యలు, వినాశకాలే విపరీత బుద్ధి అనే నానుడిని గుర్తు చేస్తున్నాయి అంటున్నారు.