మేనిఫెస్టో చించి వార్తల్లో నిలిచి..
posted on May 4, 2023 @ 6:09PM
కర్ణాటకలో ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే కాంగ్రెస్ , బీజేపీలు తమ తమ మేనిఫెస్టోలో విడుదల చేశాయి. మేనిఫెస్టోలో బూటకపు హామీలు, వాగ్దానాలు ఉంటే ప్రత్యర్థుల చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే.
ఆరోపణలు , ప్రత్యారోపణలు షరా మామూలే. కానీ ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టో ను ఏకంగా చింపి వేయడం అరుదు. గురువారం అదే జరిగింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రి వర్గంలో డిప్యూటి సీఎంగా పని చేసిన ఈశ్వరప్ప కాంగ్రెస్ మేనిఫెస్టోను చించివేశారు. ఆయన ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించారు . భజరంగ్ దళ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న కారణంగా ఆ సంస్థను తాము అధికారంలో రాగానే నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంలో పేర్కొంది. సీనియర్ బీజేపీ నేత అయిన ఈశ్వరప్పకు ఇది రుచించలేదు. హడావిడిగా మీడియాను పిలిచి మేనిఫెస్టోను చించి వేసి వార్తల్లో నిలిచారు. భజరంగ్ దళ్ కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టింది. కానీ బిజేపీ ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా మేనిఫెస్టోను చించివేయడం చర్చనీయాంశమైంది.
ఎమర్జెన్సీ సమయంలో ఆయన బళ్లారి జైల్లో గడిపారు. ఎమర్జెన్సీ అయిపోయాక ఆయన రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. షిమాగో నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ తొలిసారి విజయం పొందడానికి ఈశ్వరప్ప ప్రధాన కారణం. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కమీషన్లు కావాలని కాంట్రాక్టర్లను ఈశ్వరప్ప వేధించేవారని ఆరోపణలు ఉన్నాయి. విహెచ్ పి, ఆర్ ఎస్ ఎస్ లలో ఆయన ముఖ్య భూమిక వహించారు. రైట్ వింగ్ సంస్థలతో ఆయన దశాబ్దాల పాటు మమేకం అయి పని చేశారు. మధుర, కాశీ టెంపుల్స్ విధ్వంసం జరిగినప్పుడు ఈశ్వరప్ప విద్వేష ప్రసంగాలను చేసినట్టు ఆరోపణలున్నాయి.