భయపడం.. పారిపోము .. రాహుల్
posted on Aug 5, 2022 @ 10:16AM
నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాను మోదీ ప్రభుత్వానికి ఏమాత్రం భయపడటం లేదన్నారు. ఆయన ఏది చేయాలనుకున్నా చేసుకోవ చ్చు, తాను ఎక్కడికి పారిపోను, భయపడే ప్రసక్తే లేదని అని మోదీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. తమ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం తమను అణగదొక్కాలను కుం టోందని అది వారివల్ల జరిగేది కాదన్నారు. మోదీ, అమిత్ షా చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని దుయ్య బట్టారు.
ఆగష్టు నాలుగో తేదీన పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కాలేదు. నేష నల్ హెరాల్డ్ కార్యాలయాన్ని ఈడీ మూసివేసిన సందర్భంగా పూర్వాపరాలు చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. విపక్షనేతలను తీవ్రవాదులుగా కేంద్రం పరిగణించడాన్ని కాంగ్రెస్ తీవ్రం గా పరిగణించింది. దేశంలో ప్రజాభిమానాన్ని చాలాకాలం నుంచి చూరగొన్న రాజకీయ పార్టీ పై ఈడీ చేత దాడి చేయించడం కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్యగా ప్రజలు గమనిస్తున్నారని ఇటీవల కాంగ్రెస్ అధి కార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి బీజేపీ సర్కార్‌పై ఆగ్రహించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ, యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి తాళం వేయించిన కొద్ది రోజుల తర్వాత మీడియాతో మాట్లాడుతూ, భయమన్నది కాంగ్రెస్ డిక్షనరీలోనే లేదని సింఘ్వీ అన్నా రు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కాంగ్రెస్ నాయకత్వాన్ని అణచలేరని అన్నారు.