నిమ్మల సమయస్ఫూర్తి
posted on Jul 28, 2022 @ 4:10PM
నదులు ఉప్పొంగి వరదలు ఊళ్లను ముంచెత్తే సమయంలో ఇల్లూ, గోతం పిల్లల రక్షణ గురించే ఆలో చన ఉంటుంది. వస్తువులు, వాహనాలు కొట్టుకుపోతుంటాయి. ఇప్పటి తాజా వరదల్లోనూ దాదాపు అదే పరిస్థితి. అందరికీ అవి పోతున్నాయి, ఇల్లంతా కూలి డబ్బు, వస్తువులు పాడయిపోయాయి అనే గోడు ఎక్కువ. కానీ చాలా కొద్దిమందికే అయ్యో పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయన్న ఆలోచన ఉం టుంది. వాటిని రక్షించాలన్న ఆతృతా ఉంటుంది. అదుగో అలాంటి మనిషే ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో జోరువాన, వరదల ప్రభావంతో ప్రజలు బికుబికుమంటుంటే వారిని ఆదుకోవ డానికి గొడుగు పట్టి అడుగు ముందుకువేశారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల. అంతేకాదు వరదతాకిడి ప్రాం తాల్లో పశువులకు ఆహారం ఎలా అని ఆలోచించారు. ఆయా ప్రాంతాలు పూర్తిగా నీట మునిగితే వాటి సంగ తే మిటన్న ఆలోచన చేశారు. ఆయన వరదలో మునిగిన గ్రామాల్లోని పశువులకు పశుగ్రాసం అందజేశా రు.
తన పిలుపు మేరకు ఉండి మండలం కలిగొట్ల గ్రామం నుండి రెండు ట్రక్కులతో 200 పచ్చగడ్డి మోపుల ను అక్కడి రైతులు తీసుకొచ్చారు. ఈ గడ్డి మోపులను చూసిన పాడి రైతుల కళ్లల్లో చాలా ఆనందం కనిపిం చిందంటూ నిమ్మల తెలిపారు. పశుగ్రాసం పంపిణీకి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా లో పంచుకున్నారు.
వరద తాకిడితో ప్రజలకు సాయం చేయడం, వారిని ఆదుకోవడానికి రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేకుండా ముందుకు వచ్చి తోచిన, చేయదగ్గ సహాయం చేయడమే నాయకుని లక్షణం. ఈ సమయంలో ఆదుకోనపుడు ప్రభుత్వాలు, నాయకులు ఉండి ప్రయోజనమేమిటి. కాకున్నా, మానవతాదృక్పథంతో తోటి వారికి అలాంటి సమయాల్లో చేయూతనీయాలి. ఎమ్మల్యే నిమ్మల ఒక్కంత ముందు ఆలోచించి మూగ జీవాల సంరక్షణ విషయం పట్టించుకోవడం హర్షణీయమే.