సుధాకరా.. స్వామిభక్తి నీకు బహు మెండు!
posted on Jul 28, 2022 @ 3:40PM
చతురత ప్రదర్శించడంలో బీజేపీ వారిని మించినవారు వేరొకరు ఉండరు. ప్రతీ రాష్ట్రం, ప్రతీ ప్రాంతం లోనూ కాషాయం బాగా మెరవాలి, పువ్వు జండా ఆకాశం ఎత్తున కనపడాలి, మోదీ వీరాంజనేయుడిలా పోస్టర్ల మీద కనిపించాలి. ఇవేవీ జరగకపోతే కమలనాధులకు ఆగ్రహం వస్తుంది. గుజరాత్ కాదు ప్రతీ రాష్ట్రంలోనూ ఆ సూత్రాలు ఖచ్చితంగా పాటించి తీరాలి. గాంధీగారి బొమ్మ లేకపోయినా ఫరవా ఇల్లే.. పల్చటి తెల్లటి గడ్డంతో మోదీగారి చిర్నవ్వు చిత్రం ప్రతీచోటా ఉంటే దేశం సుభిక్షంగా ఉన్నట్టు లెక్క. ఇది బీజేపీ వర్గాలు కంఠస్త పాఠం, అమలు చేయాల్సిన ధర్మపథం. ఇదే పొంగులేటి సుధాకరూ చెబు తున్నా రు.
మహాబలిపురంలో జరుగనున్న అంతర్జాతీయ చెస్ పోటీలు భారత ప్రధాని మోదీ ఆరంభించనున్నారు. అందుకు అసలా ప్రాంతమంతా కటౌట్లు, పోస్టర్లూ సర్వం మోదీ మయం అయి ఉండాలన్నది బీజేపీ వీరాభిమానుల అభీష్టం. కానీ ఎక్కడా ఇంతవరకూ పెద్దాయన ఫోటో కూడా ఏర్పాటు చేయాలేదని బీజేపీ నేత పొంగులేటి తమిళనాడు ప్రభుత్వం మీద ఒంటికాలిమీద లేస్తున్నారు. ఇది తప్పకుండా ప్రొటోకాల్ సంబంధించిన అంశం. ఏ రాష్ట్రమైనా ప్రధానిని గౌరవించి తీరాలి. తమిళనాడు ప్రభుత్వం ఈ సంగతి పట్టించుకోవడం లేదని పొంగులేటి తెగ బాధపడిపోతున్నారు. ఫోటోలు, కటౌట్లతోనే ప్రోటోకాల్ పాటిం చడం అవుతుందా అని తమిళులూ ప్రశ్నిస్తే పొంగులేటి ఏం సమాధానం చెబుతారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ పేర్కొ న్న విధంగా ఆగస్టు 9వ నుంచి 15వ తేదీ వరకు దేశ ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. జాతీయ పతాకం, దేశభక్తి ప్రత్యేకించి బీజేపీవారి తీరులో ప్రదర్శించాలన్న నియమనిబంధన వారి దేశభక్తి కంటే బీజేపీ పాలనా సామర్ధ్యాన్ని, ఇతర రాష్ట్రాలు, విపక్షాల మీద దబాయింపులను తెలియజేస్తుందనే విమ ర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు ఏం చేయా లన్నదీ కేంద్రమే నిర్ణయిస్తే రేపో మాపో ఏం తినాలో కూడా దేశభక్తి పూరిత సూత్రాన్ని సెలవిస్తారేమో చూడాలి.