పాల్‌గారూ.. మీ సాయం ఎందుకు జాప్యం?
posted on Jul 28, 2022 @ 4:40PM
పిల్లలకు పాఠాలు చెప్పేవాడు ఉపాధ్యాయుడు, తెలిసినవే చెప్పేవాడు గురువు, తెలియపోయినా చెప్ప గలిగిన వాడు ఒక్కడే.. పేరు కే.ఏ. పాల్! అవును సరిగ్గా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైఫల్యానికి గ్రామీణు లకు తెలిసిన కారణమే కాలజ్ఞాని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాలు కూడా చెప్పారు.
కాకినాడలో జిల్లా పార్టీ నాయకుల సమావేశం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 13 జిల్లాల ను 26 చేసి అభివృద్ధి చేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ ఇప్పుడు వరద బాధితులను ఆదుకు నేందుకు తక్షణ సాయాలు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ప్రజాశాంతి పార్టీ అధ్య క్షులు వరద బాధితుల కు తమ వంతు సాయం గురించి మాత్రం ఒక్క మాటా మాట్లాడలేదు. కేవలం ఉపోద్ఘాతాలు, శాంతి ప్రవచనాలతో కాకుండా నిజంగా బాధితులకు అత్యవసర సమయంలో సహాయ పడాలి. అది కాదని మామూలు ఓటరులాగా ప్రభుత్వాన్ని, అధికారులను తిట్టడంలో కాలయాపన చేశారు.
సెప్టెంబరు 25 లోపు తెలంగాణ, ఆంధ్రలో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం సాయం ప్రక టించాలని, లేకుంటే తానే ఆర్థిక సహాయం ప్రకటిస్తానని.. అందుకు కేంద్రప్రభుత్వం నిలిపివేసిన తన పాస్ పోర్టు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉభయరాష్ట్రాల రాజధానిగా హైదరాబాదే ఉండాలని, హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ప్రపంచ నాయకులతో గట్టి పరిచయాలు, కొంత సాన్నిహిత్యమూ ఉన్న పాల్ ఇప్పుడీ పరిస్థి తుల్లో ఎలాం టి విదేశీ నాయకులనూ సంప్రదించడం లేదు. మరి దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉండగా పాల్ వంటి విశాల హృదయు లు అలా సినిమా చూస్తున్నట్టు కూర్చుంటే ప్రజలు ఏమయిపోవాలనే అభిప్రా యాలూ ఉన్నాయి.
కాగా, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై పాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకో వాలంటూ ఆ పార్టీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రామ్‌కుమార్‌తో కలిసి నాయకులు నిరసన తెలిపారు.