కాబోయే సీఎం జూనియర్..
posted on Mar 22, 2021 @ 11:02AM
నువ్వు రాముడేషమే కట్టావంటే గుండెలు అన్నీ గుడులైపోతాయే
నువ్వు కృష్ణుడలే తెర మీదికి వస్తే వెన్నముద్దలై కరిగెను హృదయాల్లే
అన్న మాటలు తెలుగు తేజం, తెలుగు తమ్ముల గళం, తెలుగు ప్రజల గుండె చప్పుడు సర్గీయ నందమూరి తారక రామారావు గుర్తు చేస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు యెనలేని ఏదో గౌరవం ఉంది.. అలాగే తాత ఇంటి పేరుతో పాటు ఒంటి పేరు, తాత తెలివిని, తెగువను, వారసత్వంగా పునికి పుచ్చుకున్న వారసుడు జూనియర్ అని చెప్పాలి.
జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ వేరు. మాస్‌లో ఆయన బ్రహ్మాండమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు జూనియర్ . కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి హీరోగా నటించిన తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాడు తారక్. తనకు జీవితంలో స్టేజీపై మాట్లాడటానికి ఇంత టెన్షన్ ఎప్పుడూ రాలేదని చెప్పాడు తారక్. రేపు పొద్దున్న తన కొడుకులు అభయ్, భార్గవ్ సాధించిన విజయాల గురించి మాట్లాడటానికి తనెంత ఇబ్బంది పడతానో ఇప్పుడు సింహా, భైరవ గురించి మాట్లాడటానికి కూడా అంతే ఇబ్బంది పడుతున్నానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. అయితే సినిమా గురించి ఈయన మాట్లాడుతున్న సమయంలోనే కింది నుంచి అభిమానులు సిఎం, సిఎం అంటూ అరిచారు. తారక్ మాట్లాడుతున్నంత సేపు కూడా అలా అరుస్తూనే ఉన్నారు.
ఓ వైపు తనకు కంగారుగా ఉందని.. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని జూనియర్ చెప్తున్న టైంలోనే అభిమానులు అలా అరిచే సరికి సీరియస్ అయ్యాడు జూనియర్. తనకు రాజమౌళి,కీరవాణి కుటుంబాలు దేవుడు ఇచ్చాడని. ఆ కుటుంబానికి తానెప్పుడూ గెస్ట్ కాలేనని అన్నాడు జూనియర్. అలాగే వాళ్లు కూడా తనకు గెస్ట్ కాదని చెప్పాడు. అలా ఎమోషనల్ స్పీచ్ మధ్యలో సీఎం సీఎం అనే అరుపులు జూనియర్‌ను బాగా డిస్టర్బ్ చేసాయి.
దాంతో వెంటనే ఆగండి బ్రదర్.. ఆగమని చెప్తున్నానా అంటూ ఒక్కసారిగా సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు తారక్. అప్పటి వరకు అరిచినా అభిమానులు ఆయన మాటలు గౌరవం ఇస్తూ సైలెంట్ అయిపోయారు. సినిమాలే కాదు జూనియర్ కి రాజకీయంగా మంచి వాక్చాతుర్యం ఉందన్న విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా సైలెంట్‌గా ఉన్నాడు. అసలు తనకు పార్టీకి సంబంధం లేదన్నట్లు చాలా దూరంగా ఉంటున్నారు. తనకు ప్రస్తుతం సినిమాలు తప్ప మరో లోకమే లేదని చెప్తున్నాడు తారక్. ఒకవేళ ఎప్పుడైనా తన అవసరం వచ్చినప్పుడు తాత పెట్టిన పార్టీ కోసం వస్తానని చెప్తుంటాడు జూనియర్.
అయితే ఆ సమయం ఇప్పుడు కాదని కూడా చెప్పాడు జూనియర్. ఇలాంటి సమయంలో అభిమానులు ప్రేమతో అరిచినా కూడా జూనియర్‌కు కోపం తెప్పించాయి. దాంతో వాళ్లను అరిచినా కూడా తర్వాత మళ్లీ కూల్ చేసాడు తారక్. ఏదేమైనా కూడా రాజకీయాల నుంచి ఆయన దూరంగా ఉన్నా.. ఆయన్ని రాజకీయాలు మాత్రం దూరంగా ఉంచేలా కనిపించడం లేదు. చూడాలి జూనియర్ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు ఉంటుందో. ఎలా ఉండబోతుందో.. అభిమానుల ఆశను ఆయన ఆహ్వానిస్తారా లేదా..