స్పీడ్ న్యూస్- 2
posted on Jul 13, 2023 @ 3:10PM
21.హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో 12 ఏళ్ల బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. రాత్రి నుంచి గాలిస్తున్నా ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో కిడ్నాప్ అయి ఉంటాడని భావిస్తున్నారు.
22.తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో చూచిరాతలు, కుంభకోణాలను ప్రతి రోజు చూస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించారు.
23.చైనా లోన్‌యాప్ ఏజెంట్ల వేధింపులకు మరొకరు బలయ్యారు. పెరుగుతున్న వేధింపులు తట్టుకోలేక ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం బెంగళూరులో వాటిల్లింది.
24.ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశానికి పయనమయ్యారు.
25.కేరళలో ప్రొఫెసర్ చేతిని నరికిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఆరుగుర్ని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. దోషులపై మోపిన అన్ని అభియోగాలు రుజువయ్యాయి.
26.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అ, ఆలు కూడా రావని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం జగన్‌కు వారాహికి, వరాహికి తేడా తెలియదన్నారు.
27. సినీ నిర్మాత బండ్ల గణేశ్ హాస్పిటల్లో బెడ్ పై ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చేతికి సెలైన్ కూడా ఉండటంతో ఆయనకు ఏమయిందనే చర్చ జరుగుతోంది.
28. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తిరుమల చేరుకున్నారు. సతీమణితో కల్సి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.
30.ఉత్తర భారత దేశాన్ని భారీ వర్షాలు కుదుపేస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీలో ఓ కొండ కుప్ప కూలిపోయింది.
31 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలంటూ పలు వేదికల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లే ముందు మరోసారి ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
32.మంత్రి రోజా తిరుమల దర్శనానికి వెళ్లారు. ఆమెతో పాటుగా శ్రీముఖి ఫ్యామిలీ కూడా వెళ్లింది. ఇలా మంత్రి రోజాతో కలిసి జబర్దస్త్ ఆర్టిస్టులు, బుల్లితెర తారలు నిత్యం తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
33.కుండపోత వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సం సృష్టించాయి. నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ రహదారులు, నివాసాలు కొట్టుకుపోయాయి.
34.దేశ వ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. అన్ని అయితే ఇటీవల భారీగా పెరిగిన చికెన్ ధరలు.. నేల చూపులు చూడటంతో కిలో చికెన్ రూ.150 నుంచి రూ.180 మధ్య అమ్ముతున్నారు.
35.గ్రేటర్ నోయిడా పరిధిలోని హోషియార్ పూర్ పరిధిలో నివసించే శైలజా చౌదరీ అనే మహిళకు గత శుక్రవారం ఒక ఈ- చలాన్ వచ్చింది. ఆమె పేరిట ఎటువంటి బైక్, కారు రిజిస్టర్ కానప్పటికీ ట్రాఫిక్ పోలీసులు 1000 రూపాయల చలానా విధించారు.
36. టమాటాలకు బౌన్సర్లు పెట్టుకున్న యూపీకి చెందిన కూరగాయల వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో వారణాసికి చెందిన సమాజ్‌వాది పార్టీ కార్యకర్త తన దుకాణం వద్ద బౌన్సర్లు కాపలాగా ఉంచిన విషయం తెలిసిందే.
37.దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేసిన నలుగురు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు శిక్ష పడింది. గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్‌సుఖ్‌నగర్ జంటపేలుళ్లతోనూ వీళ్లకు సంబంధాలు ఉన్నాయి. ఎన్‌ఐఏ కోర్టు శిక్షలను ఖరారు చేసింది.
38.తెలంగాణలో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జూన్ 26తో ముగిసింది.
39. ఇంటి కుక్కే కదా అని కుక్కకాటును నిర్లక్ష్యం చేసినందుకు 40 ఏళ్ల జ్యోతి అనే మహిళ మృత్యువాత పడింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో చోటు చేసుకుంది. సకాలంలో కుక్క కాటుకు వైద్యం అందిస్తే ఆ మహిళ బతికేదని వైద్యులు అంటున్నారు.
40.ఆవర్తనం కారణంగా వచ్చే రెండ్రోజులు తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌కు ఎల్లోఅలర్ట్ జారీ చేశారు.
41. తెలంగాణలో ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరిస్తోందని సీల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.
42. 'జయం' చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన హీరోయిన్ సదా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. తనకు పెళ్లి అంటే ఆసక్తి లేదని స్పష్టం చేసింది.
43.బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రం కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
44. టెస్లా ఎలక్ట్రానిక్ కార్ల దిగ్గజ సంస్థ భారత మార్కెట్‌లోకి మాత్రం ఇప్పటిదాకా ప్రవేశించలేదు.ఈ నేపథ్యంలో భారత మార్కెట్లోకి వీలైనంత త్వరగా అడుగుపెట్టేందుకు టెస్లా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది.
45.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్ లో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆసీనులయ్యారు.
46. చంపేస్తానని బెదిరించి 9వ తరగతి విద్యార్థి నుంచి లక్షలు గుంజాడో పదో తరగతి విద్యార్థి. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిందీ ఘటన.
47. ఏపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీలు కలుస్తాయని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సంకేతాలను ఇచ్చిందని చెప్పారు.
48.షర్మిల పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉంటే సరిపోదని అన్నారు. అర్జెంట్‌గా అధికారంలోకి వచ్చేయాలని అనుకుంటే కుదరదని చెప్పారు.
49.దక్షిణ అమెరికాలోని చిలీ దేశాన్ని ఇప్పుడు కొత్త వైరస్ ఒకటి తీవ్రంగా కలవర పెడుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏం చేయాలో పాలు పోని చిలీ సర్కార్.. 3 నెలలు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
50.చంద్రయాన్-3 విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాకెట్ నమూనాను చెంగాలమ్మ అమ్మవారి ముందు ఉంచి, ప్రయోగం సాఫీగా జరగాలని ప్రార్థించారు.