స్పీడ్ న్యూస్ -2
posted on Jul 12, 2023 @ 3:01PM
21.సోషల్ మీడియాలో వివాదాస్పద వీడియో పోస్ట్ చేసిన ప్రముఖ సినీ స్టంట్ మాస్టర్, నటుడు కనల్ కన్నన్‌ను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు నాగర్‌కోయిల్‌లో అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ డీఎంకే నేత ఫిర్యాదు చేయడంతో కన్నన్‌ను అరెస్ట్ చేశారు.
22.భీమవరంలో పవన్ కల్యాణ్ ఓడిపోయే అవకాశమే లేదని, అక్కడ ఓడిపోవడానికి కారణం ఎవరో తెలుసుకోవాలని జనసేనానికి ఎపి ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి హితవు పలికారు. పవన్ ఓటమికి వైసీపీ కారణం కాదని తేల్చిచెప్పారు.
23. రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు గాను బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ అవకాశం దక్కక పోవడం గమనార్హం.
24. మూడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక అని ఆయన అభివర్ణించారు.
25. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఈనెల 17, 18వ తేదీల్లో బెంగళూరులో జరిగే ప్రతిపక్ష నేతల తదుపరి సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. దీనికి 24 పార్టీలను ఆహ్వానించినట్లు సమాచారం.
26. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. త్వరలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలోసభలో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి కేంద్ర మంత్రి వర్గం చర్చిస్తోంది.
27.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో వరుసగా రెండోసారి ఓడిపోయిన భారత్.. నెల విరామం తర్వాత మళ్లీ టెస్టు క్రికెట్ బరిలోకి దిగుతోంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది.
28.ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటీర్ల అంశంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ వాలంటీర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా పని చేయాలని అన్నారు.
29. దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఏడాది క్రితం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన శ్రద్దా వాకర్ హత్య ఘటన తరహాలో మరో యువతి హత్య జరిగింది.
30.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్త ఇంటికి మారబోతున్నట్టు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ బీ2 ప్రాంతంలోని త్రీ బెడ్రూమ్ ఫ్లాట్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం.
31.బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి రాహుల్ కుమార్ ఇటీవల ప్రయాణం రద్దు చేసుకుని ఎయిర్ టికెట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. రూ.13,820 పెట్టి కొన్న టికెట్ ను క్యాన్సిల్ చేస్తే సదరు ఎయిర్ లైన్స్ కంపెనీ తిరిగిచ్చింది. కేవలం 20 రూపాయలు మాత్రమే చార్జి వసూలు చేసింది.
32. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం కుదరదని స్పష్టం చేశారు.
33.ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించిందని, వచ్చే నెల లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
34. గత రెండు ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలు, ఆంధ్రతో సరిహద్దు పంచుకుంటున్న ఖమ్మంలో ఎక్కువగా ఉన్న ఆంధ్ర సెటిలర్లతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారిని తమవైపునకు తిప్పుకునేందుకు టీకాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం.గులాబీ పార్టీ నేతల వైఖరిపై ఆంధ్ర సెటిలర్స్‌లో ఓ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
35. బీజేపీ, కాంగ్రెస్ లను విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదం మూడు పంటలని, కాంగ్రెస్ పార్టీ విధానం మూడు గంటలని, బీజేపీ విధానం మతం పేరిట మంటలని విమర్శించారు.
36.ప్రఖ్యాత మైత్రి బ్యానర్ ఇప్పుడు ఇతర భాషా చిత్రాల నిర్మాణం దిశగా కూడా అడుగులు వేయడం మొదలెట్టింది. ఆల్రెడీ బాలీవుడ్ లో ఒక ప్రాజెక్టును లైన్లో పెట్టేసింది. అలాగే మల్లూవుడ్ లోను ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించింది.
37.సంచలనం సృష్టించిన జగన్ పై దాడి కేసు విచారణ కొనసాగుతోంది. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో నిన్న ఈ కేసు విచారణ జరిగింది.
38.అనిల్ అంబానీకి చెందిన బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ ను గౌతమ్ అదానీ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది. అనిల్ అంబానీకి చెందిన పవర్ ప్లాంట్ ను కొనుగోలు చేయడం ద్వారా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులో తన పరిధిని విస్తరించాలని అదానీ గ్రూప్ భావిస్తోంది.
39.వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో అతి పెద్ద సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వైటెక్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది.
40.జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యల చిచ్చు ఇప్పట్లో చల్లారేట్టు కనిపించడంలేదు. వాలంటీర్లలో 75 శాతం మహిళలే ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్లదే కీలక పాత్ర" అని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.
41.వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వినూత్న నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలోని ఓ వాలంటీర్ కాళ్లు కడిగారు.
42.ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో అనేక జిల్లాల్లో గణనీయంగా వర్షపాతం నమోదైంది.
43. ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో వివాదానికి తెరపడిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. తాను స్వయంగా కడియం కులం గురించి ప్రస్తావించలేదని, గతంలో ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను ఉటంకించినట్లు చెప్పారు.
44.ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. తమిళనాడులో కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక, విహార యాత్రకు వెళ్లారు.
45.ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 20 చీతాల్లో మరో చీతా మృతి చెందింది. నాలుగు నెలల వ్యవధిలో ఇది 7వ చీతా మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్‌లో జరిగింది.
46.తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే క్లారిటీ ఇచ్చారు. సీఎంగా ఎవరికైనా అవకాశం లభించవచ్చని, ఇప్పుడు చెప్పలేమని తెలిపారు.
47. వినియోగదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఇప్పుడు కొత్త సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా టాటా స్ట్రైడర్ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
48.యూనిఫామ్ సివిల్ కోడ్‌పై అభిప్రాయాలు తెలపాలని 22 వ లా కమిషన్ జూన్ 14 వ తేదీన ప్రకటన విడుదల చేసింది. జులై 10 వ తేదీ సాయంత్రం వరకు 46 లక్షల అభ్యర్థనలు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
49.ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి అమలు చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది.
50.మనీల్యాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీష్ ( కుమారుడు సులేమాన్ షేబాజ్ సహా పలువుర్ని ప్రత్యేక జిల్లా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. రూ.1,600 కోట్ల పీకేఆర్ మనీ ల్యాండరింగ్ కేసులో తమ పేర్లను తొలగించాలని కోరుతూ ప్రధాని కుమారుడు సులేమాన్ షేబాజ్, ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది.