స్పీడ్ న్యూస్ 1
posted on Jul 12, 2023 @ 12:25PM
1.దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల్లో 80 మంది ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే మరణించారు.
2.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే సీతక్క కూడా సీఎం అయ్యే అవకాశం ఉందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి. రేవంత్ మాటలపై సీనియర్లు కన్నెర్ర చేస్తున్నారు.
3.ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న ఢిల్లీ వెళ్లిన ఆయన ఈసీఐ డిప్యూటీ కమిషనర్‌తో మూడు గంటలపాటు సమావేశమయ్యారు.
4. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రమంగళవారం సాయంత్రం కావలి నియోజకవర్గంలో పూర్తయి ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఈ సందర్బంగా నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
5. 2016-17 నుండి 2021-22 మధ్య ఆరేళ్ల కాలంలో ఇతర అన్ని జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలతో పోలిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మూడు రెట్లు ఎక్కువగా వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలలో సగానికి పైగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారానే వస్తున్నాయి.
6. రాష్ట్రంలో వీఆర్ఏల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏల విద్యార్హతలు, సామర్థ్యాల మేరకు సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
7.కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన 50వ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలు వంటి బెట్టింగులపై 28 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించారు.
8. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ... ఉచిత విద్యుత్ ను ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ అన్నారు.
9.ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ఒకసారి పార్లమెంటులో పాస్ అయ్యాక, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇబ్బందిగా అనిపిస్తే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవచ్చునని బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. కె సి ఆర్ దేశం విడిచివెళతానంటే ఎవరూ ఆపరని అన్నారు.
10.జనసేనాని పవన్ కల్యాణ్ బుధవారం ఏలూరుజిల్లా ఉంగుటూరు నియోజకవర్గ జనసేన నేతలు, వీరమహిళలతో సమావేశమయ్యారు. వాలంటీర్ వ్యవస్థపై త్వరలో కోర్టుకు వెళతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
11.రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ... రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే ఏ రాజకీయ పార్టీకైనా వచ్చిన సమస్య ఏమిటని ఆమె ప్రశ్నించారు.
12.ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తున్న, ఇప్పటికే చేసిన పరిశ్రమలలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రైవేటు పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు జగన్ సూచించారు.
13.ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏరోనిక్స్ ఇంటర్నెట్ అనే ఐటీ కంపెనీ ఎండీ ఫణీంద్ర సుబ్రహ్మణ్య, సీఈవో విను కుమార్ లను ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఫెలిక్స్ దారుణంగా హతమార్చాడు.
14. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో పలు పరిశ్రమలకు అనుమతులను ఇవ్వడంతో పాటు భూ కేటాయింపులను కూడా మంత్రివర్గం సిఫారసు చేయనుంది.
15.తనకు పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టడమే గాక విగ్గుతో బట్టతలను దాచిపెట్టి పెళ్లికి సిద్ధమైన వ్యక్తిని పట్టుకుని వధువు బంధువులు మండపంలోనే చితకబాదారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రం గయ జిల్లాలో జరిగింది.
16.తెలంగాణలో రాబోయే ఐదు రోజులు, ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.
17.బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సలహాతో తాను ఇద్దరు పిల్లలకు తల్లినయ్యానని మరో బాలీవుడ్ నటి కశ్మీరా షాతెలిపింది. సరోగసీ ద్వారా పిల్లలను కనేందుకు ప్రయత్నించమని సల్మాన్ చెప్పారని... ఆయన సలహాతో పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత తమ జంట తల్లిదండ్రులమయ్యామని చెప్పింది.
18. మహానాడులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. వీటిలో పూర్ టు రిచ్ విధానం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పూర్ టు రిచ్ విధానాన్ని అర్థం చేసుకోవడం కొంత కష్టమైనా... ఆచరణలో ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చంద్రబాబు అన్నారు.
19. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని నిన్న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక వైద్యశాలలో నూతన భవనాలు, పలు విభాగాలను ఆమె ప్రారంభోత్సవ సభలో కాసేపు మాట్లాడి కూర్చుండిపోయారు.
20. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా గిరిజన సంక్షేమ వసతిగృహంలో ఉండి చదువుకుంటున్న నాలుగో తరగతి గిరిజన విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు అత్యంత దారుణంగా చంపేశారు.జిల్లాలోని బుట్టాయగూడెం మండలం పులిరాముడుగూడెంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.