స్పీడ్ న్యూస్ 1
posted on Jul 7, 2023 @ 3:37PM
1. బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కూతురు డీకే శృతిరెడ్డి నమ్మిన వ్యక్తి చేతిలోనే మోసానికి గురయ్యారు. ఆయన వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తి ఆమె క్రెడిట్ కార్డును దొంగిలించి లక్షల రూపాయలు కొట్టేశాడు.
2.వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి దేశం నుంచి పారిపోయి సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియ శిష్యురాలు, సినీ నటి రంజితను కైలాస దేశానికి ప్రధానిగా ప్రకటించాడు.
3.ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్న సినీ నటుడు సీనియర్ నరేశ్ తుపాకి లైసెన్స్ కోసం అనుమతి కోరుతూ ఎస్పీని కలిశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వాలంటూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీని మాధవరెడ్డిని కోరారు.
4.కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో రోజుకో వైరల్ ఉదంతం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఓ హిందూ వ్యక్తి బస్సులో ఉచిత ప్రయాణం కోసం బుర్ఖా ధరించాడన్న వార్త వైరల్‌గా మారింది.
5.ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌తోపాటు తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్లతోపాటు రూ. 12 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
6.ఉత్తరప్రదేశ్‌లో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కోతి ఏకంగా రూ. 1.5 లక్షలను చోరీ చేసింది. షాబాద్‌లోని రిజిష్ట్రీ ఆఫీసుకు వచ్చిన షరాఫత్ హుస్సేన్ బైక్ నిలిపి కార్యాలయం లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన అతడి బ్యాగులోని రూ.1.5 లక్షలు ఉన్న బ్యాగును ఓ కోతి ఎత్తుకుపోయింది.
7.లవర్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భార్యను అతడికే ఇచ్చి పెళ్లిచేశాడో భర్త! బీహార్‌లోని నవాడా జిల్లాలో ఇటీవల వెలుగు చూసిందీ ఘటన.
8.ప్రపంచంలో క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా వెళ్లి ఆడేందుకు తాము సిద్ధమన్నాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్. ఇండియాలో ఎక్కడైనా, ఎవరితోనైనా ఆడేందుకు రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చాడు.
9.సెలవులు పెట్టేందుకు సాకులు వెతికే ఉద్యోగులు కోకొల్లలుగా ఉన్న ప్రపంచంలో ఓ వ్యక్తి 74 ఏళ్ల పాటు లీవ్ పెట్టకుండా జాబ్ చేశారంటే నమ్మడం కష్టమే! అమెరికాకు చెందిన ఓ మహిళ దశాబ్దాల పాటు ఏకధాటిగా పనిచేసి ఇటీవలే 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ తీసుకున్నారు.
10.పాక్ వ్యాపార, క్రికెట్ వర్గాల్లో విషాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్స్ యజమాని ఆలంగీర్ ఖాన్ తరీన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
11.ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హౌరా నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఈ ఎక్స్ ప్రెస్ యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య అగ్నిప్రమాదానికి గురైంది.
12.డిసెంబర్ లో జరగనున్న ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. వరుసగా రెండో సారి హస్తం పార్టీ అధికారాన్ని చేపడుతుందని తేలింది.
13.దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ లోని గంగోత్రి ధామ్ లో కేజీ టామాటా రూ. 250గా ఉంది.
14.కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థుల్లో 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనిఉ వనపర్తి జిల్లా అమరచింతలో జరిగిందీ ఘటన.
15.హైదరాబాద్ యువ కెరటం, తెలుగుతేజం తిలక్ వర్మ వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు భారత జట్టులో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిలక్ వర్మకు అభినందనలు తెలిపారు.
16.జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయయాత్ర రెండోదశ ఈ నెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి ప్రారంభం కానుంది. గత నెల 14న అన్నవరంలో ప్రారంభమై అశేష జనావళి జేజేలు అందుకున్న వారాహి యాత్ర రెండో దశ ఏలూరు నుండి ప్రారంభించడానికి పవన్ కల్యాణ్ సంకల్పించారని పార్టీనేత హరిప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
17.నేను ఎన్సీపీ అధ్యక్షుడిని.. నా వయస్సు 82 ఉందా? 92 ఉందా? అనేది విషయంకాదు.. పార్టీని పునర్నిర్మిస్తానని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ అన్నారు.
18.తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం బండి సంజయ్ శుక్రవారం హైదరాబాద్ కు వచ్చారు. నాలుగు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన కీలక నేతలతో చర్చలు జరిపారు.
19.భారతీయ రైల్వేలో వేగవంతమైన రవాణాపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికే వందేభారత్ పేరిట సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెట్టిన కేంద్రం బుల్లెట్ రైళ్లను కూడా తీసుకువచ్చేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది.
20. గతంలో ఉద్యోగం చేసిన భార్య, భరణం కోసం చూస్తూ ఖాళీగా కూర్చోకూడదని, తన భర్త నుంచే మొత్తం ఖర్చులు భరణంగా పొందాలని చూడవద్దని కర్ణాటక హైకోర్టు తీర్పు నిచ్చింది.
21. ఏపీ సీఎం జగన్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం భూములు సేకరించాలని అధికారులను ఆదేశించారు
22.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి ఎన్నికలు త్వరగా వచ్చేలా చూడాలని పెద్దల కాళ్లు పట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు గురువారం విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందన్నారు.
23.తాను దేనికీ భయపడే వాడిని కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చత్తీస్‌గఢ్‌లో అవినీతి ప్రభుత్వాన్ని బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
24.విజయవాడ కేంద్రంగా సేవలు అందిస్తున్న ఆంధ్రా హాస్పిటల్స్ గ్రూప్ ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. తాజాగా విశాఖలోనూ ఆంధ్రా హాస్పిటల్స్ ఏర్పాటైనట్టు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వెల్లడించారు.
25.ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ పలువురు నేతలు అంటుండడం, కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు గుప్పు మంటున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు అనేది మీడియా సృష్టి అని, కొన్ని పార్టీలు ముందస్తు అని ప్రచారం చేస్తున్నాయని ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.