స్పీడ్ న్యూస్- 2
posted on Jul 1, 2023 @ 4:46PM
1.రేపు ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారు.విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు రేపు
సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన చేరుకుంటారు.
2.ప్రస్తుతం దేశం అత్యంత సంక్షోభంలో ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సంక్షోభంలో మన గణతంత్రం - విశ్లేషణ అనే అంశంపై ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా సంస్థ నిర్వహించిన సదస్సులో పరకాల ప్రభాకర్ మాట్లాడారు.
3.జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డిల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధిగా తన విధులను నిర్వర్తించకుండా తన కూతురు, అల్లుడు అడ్డుకుంటున్నారంటూ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు.
4.జూన్ మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్రం నేడు వెల్లడించింది. గత నెలలో వసూలైన జీఎస్టీ రూ.1,61,497 కోట్లు అని కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
5.ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ విడాకులు తీసుకున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది.
6.ముఖ్యమంత్రి జగన్ టీమ్ ప్రతిపక్షాలను ఇబ్బందిపెట్టి పైశాచిక ఆనందం పొందుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడూతూ... వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీధీ రౌడీల్లా వ్యవహరిస్తూ పైశాచిక ఆనందం పోందుతున్నారని విమర్శించారు.
7.వైఎస్సార్టీపీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించిన వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఖండించారు.
8.ఖమ్మం సభ తర్వాత తమ పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన చాలామంది నేతలు వస్తారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి చెందిన నేతలు కూడా తమతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు.
9.‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్‌బీసీ) గౌరవాధ్యక్షుడిగా రాజమౌళి నియమితులయ్యారు.
10. సాధారణ వ్యక్తులు సైతం కేరళలో లాటరీ గెలిచి కోటీశ్వరులయ్యారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన బిర్షు రాంబ అనే వలస కార్మికుడు కేరళ లాటరీ విజేతగా నిలిచాడు.