స్పీడ్ న్యూస్
posted on Jul 1, 2023 @ 12:25PM
1. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా మరోమారు అదరగొట్టాడు.లుసానె డైమండ్ లీగ్ పోటీల్లో 87.66 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి విజేతగా నిలిచాడు.
2.మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే... కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో శని త్రయోదశి సందర్భంగా శని దోష నివారణ కోసం తైలాభిషేకం చేయిస్తుండగాకళ్లు తిరిగి తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.
3.తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు జరగబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమయ్యేలానే కనిపిస్తోంది.
4.గత కొన్నిరోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి తక్కువగా నమోదైంది. అయితే నిన్న తొలి ఏకాదశి కావడం, వీకెండ్ కూడా రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు.
5.కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి మంచి మనసు చాటుకున్నారు. యాసిడ్ దాడి బాధితురాలికి తన సచివాలయంలో ఉద్యోగం కల్పించాలని సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు.
6.ఆధార్ ను పాన్ కార్డ్ తో లింక్ చేసుకోవడానికి శుక్రవారంతో గడువు ముగిసింది. అయితే నిన్న చివరి రోజు కావడంతో ఆధార్ ను లింక్ చేసుకోవడానికి ఆన్ లైన్ లో ప్రజలు పోటెత్తారు.
7.ఒడిశాలో జరిగిన ఘోర రైల్వే ప్రమాదం తర్వాత అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది.
తాజాగా సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ అర్చనా జోషిపై ప్రభుత్వం వేటువేసింది.
8. 2015లో తన ఫ్యాన్స్ కు, ప్రభాస్ ఫ్యాన్స్ కు మధ్య జరిగిన గొడవపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆ ఘటన తనను ఎంతో బాధించిందని చెప్పారు. అప్పట్లో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పోస్టర్ల వైరం జరిగింది.
9.బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటికి వార్నింగ్ ఇస్తూ ఖమ్మంలో పోస్టర్లు వెలిశాయి. పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవంటూ పోస్టర్లలో హెచ్చరికలు జారీ చేశారు.
10. పాక్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిదీ తన పదునైన నిప్పులు చెరిగే బంతులతో సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే 4 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.