స్పీడ్ న్యూస్- 3
posted on Jun 30, 2023 @ 3:53PM
31.ప్రస్తుతం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. రెండో టెస్టులో లబుషేన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బబుల్ గమ్ పడిపోయిన నేపథ్యంలో క్షణం కూడా ఆలోచించకుండా.. అతడు కింద పడిపోయిన చూయింగ్ గమ్‌ను తీసుకుని మళ్లీ నోట్లోకి వేసుకున్నాడు.
32.పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం కేంద్రం సమీపంలో గర్భంతో ఉన్న జింక మృతి చెందింది. ఓ తోటలో జింక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
33. ఓ జొమాటో డెలివరీ బోయ్ పుట్టిన రోజుని రొటీన్ కు భిన్నంగా జరుపుకున్నాడు. తాను డెలివరీ చేసిన ప్రతీ ఆర్డర్ తోపాటు ఉచితంగా 5స్టార్ చాక్లెట్ ఇచ్చాడు.
34.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే అందిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక హమీ ఇచ్చారు. దీంతో పాటు ప్రజలకు సరిపడా ఇంటి రేషన్ కూడా ఇస్తామన్నారు.
35.వెన్నీపుమీద తెల్లని నామం దిద్ది, మధ్యలో ఎర్రని తిరుచూర్ణం పెట్టినట్టున్న ఈ తొండ తిరుమల కొండల్లో అరుదుగా కనిపిస్తుంటుంది. తిరుపతి అలిపిరి సమీపంలో ఒక బండమీద దర్శనమిచ్చింది.
36.బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శేజల్‌ను ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ పరామర్శించారు. నైతిక బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
37.రాబోయే ఎన్నికల్లో బీజేపీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని అన్నారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి. జనాలు మార్పును కోరుకుంటున్నారని, కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ఫిక్స్ అయినట్లు చెప్పారు.
38.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ కాలెండర్ తెస్తామని తెలిపారు టీడీపీ యువనేత నారా లోకేష్. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కంపెనీలను వేరే రాష్ట్రాలకి వెళ్లేలా చేస్తోందని, అలాంటి పరిస్థితి రానివ్వకుండా చేస్తామన్నారు.
39.జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు.
40.ప్రముఖ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అంత్యక్రియలు ముగిసాయి. సాయి చంద్ కు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా తుది వీడ్కోలు పలికాయి.