స్పీడ్ న్యూస్ 2
posted on Jun 30, 2023 @ 3:22PM
11.ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో రెండో సారి ఫైనల్లో బోల్తాపడ్డ టీమిండియా.. కొత్త డబ్ల్యూటీసీపై ఫోకస్ పెట్టనుంది. వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ తో డబ్ల్యూటీసీ కొత్త సీజన్ ను ప్రారంభించనుంది.
12. భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ దంపతులకు శుక్రవారం బారసాల కార్యక్రమం జరుగనున్న నేపథ్యంలో అద్భుతమైన బహుమతిని పంపించినట్టు సమాచారం. రూ. 1.20 కోట్ల విలువైన బంగారు ఊయలను గిఫ్ట్ గా పంపించినట్టు తెలుస్తోంది.
13. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలపై తెలుగుదేశం పార్టీ 'ప్రకాశించని నవరత్నాలు.. జగన్ మోసపు లీలలు' అనే పుస్తకాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. పుస్తకాన్ని విడుదల చేస్తున్న సమయంలో జగన్, వైసీపీపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.
14.ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించనున్న నేపథ్యంలో విద్యార్థులకు యాజమాన్యం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులెవరూ నలుపు రంగు దుస్తులు ధరించి రావద్దని, అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది.
15. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండల కేంద్రానికి చెందిన దర్వేష్ సాహెబ్ రెండు రోజుల క్రితం కేరళ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. దీంతో, పట్టణ ప్రజలు, ఆయన స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
16. విశాఖలో గన్ లైసెన్సులపై నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ స్పందించారు. విశాఖలో 620 గన్ లైసెన్సులు ఉన్నాయని, 2020 నుంచి కేవలం 15 మందే తుపాకీ కావాలని దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.
17.భారత విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) స్టాక్స్ స్థిరంగా కదులుతున్నాయి. ఈ స్టాక్ ఇటీవల పరుగులు పెడుతోంది.
18.జపాన్‌లోని నాగో నగరం ప్రజలు ఉదయం లేస్తూనే షాకయ్యారు. అక్కడి నది ఒక్కసారిగా ఎర్రగా మారిపోవడంతో ఏం జరిగిందో అర్థంకాక భయభ్రాంతులకు గురయ్యారు.
19.ఆర్టిఫీషియల్ స్వీట్ నర్ ఆస్పర్ టేమ్ కేన్సర్ కారకం కావచ్చంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వచ్చే నెలలో ప్రకటించనుంది. దీన్ని దీర్ఘకాలం పాటు తీసుకున్నప్పుడు కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుందని తెలుస్తోంది.
20. ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. ఈరోజు ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి.