స్పీడ్ న్యూస్ 1
posted on Jun 30, 2023 @ 3:08PM
1.అవినీతి ఆరోపణలతో జైలుపాలైన మంత్రి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి సంచలనం సృష్టించిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తగ్గారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సూచనలతో తన ఆదేశాలతో నిలుపుదల చేశారు.
2.తెలంగాణ హైకోర్టు సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. చరిత్రలో తొలిసారి ఒక తీర్పును తెలుగులో వెలువరించింది.
3.మంచంపై నోట్ల కట్టలతో తన భార్యాపిల్లలు దిగిన సెల్ఫీ ఓ పోలీసు అధికారిని చిక్కుల్లో పడేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది
4.కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదా బిల్లు ఈ వర్షాకాల సమావేశంలో పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. యూసీసీపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు న్యాయ కమిషన్, న్యాయ మంత్రిత్వశాఖతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జులై 3న సమావేశం కానుంది.
5.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం ప్రజలపై అద్భుతమైన ప్రభావం చూపించిందని కొనియాడారు.
6.తనకూ, రసమయి బాలకిషన్‌కు రాజకీయాలు తెలియవని ప్రముఖ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. జగపతిబాబు ప్రధాన పాత్రలో డా. రసమయి బాలకిషన్ నిర్మించిన ‘రుద్రంగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
6.మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. కంగ్‌పోంక్పి జిల్లాలో చనిపోయిన మరో వ్యక్తిని రాజధాని ఇంఫాల్‌కు తీసుకురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
7.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందేభారత్ రైలు సర్వీసులకు ప్రజల్లో మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. వేగవంతమైన ప్రయాణం, అద్భుతమైన వసతులు వెరసి ఈ రైళ్లకు ప్రజాదరణ దక్కింది.
8.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. 141వ రోజు గూడూరు నియోజకవర్గం కాకువారిపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర... బల్లవోలు కొత్తపాలెం క్రాస్, చింతవరం, మొగలి కొత్తపాలెం, అల్లీపురం, ఏరూరు, మోమిడి మీదుగా వరగలి విడిది కేంద్రానికి చేరుకుంది.
9.కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణలో రూ.10 లక్షల కోట్ల అప్పులు అవుతాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని, ప్రసంగించారు.
10.కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలనేది 40 ఏళ్ల డిమాండ్ అని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పాయని, ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం కావడంపై గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామన్నారు.