స్పీడ్ న్యూస్ -1
posted on Jun 29, 2023 @ 2:34PM
1. ప్రవాసాంధ్రురాలు స్వాతిరెడ్డి పోరాటానికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఆమెకు ఫోన్ చేసి మాట్లాడిన టీడీపీ అధినేత ఆమెపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
2.మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వ్యతిరేక నిరసనల్లో తమ లోగో వినియోగించడంపై ఫోన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా తమ లోగోను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించింది.
3.రాజకీయ రంగ ప్రవేశంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఊహాగానాలకు తెరదించాడు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు తాజాగా ప్రకటించాడు.
4.మొత్తానికి కరోనా వైరస్ సహజంగా పుట్టినది కాదన్న విషయం బహిర్గతమైంది. వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే పురుడు పోసుకుందని వైరాలజీ ఇనిస్టిట్యూట్ పరిశోధకుడు చావోషావ్ వెల్లడించాడు.
5. తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
6. ఉత్తరప్రదేశ్ విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ నియామక పరీక్షలో నకిలీల బెడదకు కృత్రిమ మేధతో చెక్ పడింది. మంగళవారం జరిగిన ఈ పరీక్షకు ఏకంగా 87 మంది నకిలీ అభ్యర్థులు హాజరయ్యారు.
7ప్రొటీన్ షేక్‌లతో ఆరోగ్య సమస్య తలెత్తే ప్రమాదం ఉంటే ఆ విషయాన్ని ప్యాకింగ్‌పై స్పష్టంగా ముద్రించాలని బ్రిటన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తాజాగా అభిప్రాయపడ్డారు. మూడేళ్ల క్రితం ప్రొటీన్ షేక్ తాగిన భారత సంతతి టీనేజర్ రోహన్ గోధానియా మరణించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
8.తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ కమల దళపతి బండి సంజయ్ స్పందించారు. బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తల్లో వాస్తవం లేదన్నారు.
9.భారతీయ సినిమా ఖ్యాతిని 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డులను సాధించడమే కాక ఇప్పుడు ఆ సినిమా టీమ్ ఏకంగా ఆస్కార్ జ్యూరీ మెంబర్లు అయ్యేంత గొప్ప స్థాయిని తీసుకొచ్చింది.
10.హాలీవుడ్ శృంగార తార, సింగర్ మడొన్నా వయసు 64 ఏళ్లకు చేరుకున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.