స్పీడ్ న్యూస్-2
posted on Jun 28, 2023 @ 4:11PM
11.గృహ రుణాల దిగ్గజం హెచ్ డీఎఫ్ సీ, ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు విలీనానికి సర్వం సిద్ధమైంది. వీటి విలీన ప్రక్రియ జులై 1 నుంచి అమల్లోకి రానుంది.
12. హెచ్ 1 బి వీసాపై అమెరికాలో ఉంటున్న వారికి కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వీసా హోల్డర్లు తమ కుటుంబ సభ్యులతో పాటు కెనడాలోకి వచ్చి పనిచేసుకునే వీలు కల్పిస్తున్నట్లు వివరించింది.
13. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు.
14. భారత్ ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసీసీ నేడు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది.
15.ఇంగ్లండ్ క్రికెట్ లో జాతి వివక్ష ఎదుర్కొన్న ప్రతి బాధితుడు లేదా బాధితురాలికి ప్రత్యేకంగా క్షమాపణ కోరుతున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) లేఖను విడుదల చేసింది. జాతి వివక్షపై ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ఈక్విటీ ఇన్ క్రికెట్ తన నివేదికను ఈసీబీకి సమర్పించింది.
16. తెలంగాణలో మే 25న ఎంసెట్ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. జూన్ 26 నుంచి కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ ప్రక్రియ జరుగుతోంది. జులై 12 నుంచి సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.
17.క్రికెటర్ అంబటి రాయుడు మంగళవారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా అమీనాబాద్ లోని మూలాంకరీశ్వరి దేవి ఆలయంలో పూజలు నిర్వహించారు.
18. ఈ నెల 29న బక్రీద్ కాగా, ప్రస్తుతం పాక్ లో మేకలు, గొర్రెల వంటి జీవాలకు రక్షణ లేకుండా పోయింది. బక్రీద్ సమయంలో జంతువులను బలి ఇవ్వడం సంప్రదాయం. అయితే మేకలు, గొర్రెల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో చాలామంది దొంగతనాలకు పాల్పడుతున్నారు.
19.కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. మీపై అనేక కేసుల్లో విచారణ జరుగుతోంది... ఒకవేళ మీరు దోషిగా తేలితే అయితే మీ తర్వాత సీఎం ఎవరు? అంటూ తన లేఖలో ప్రశ్నించారు.
20.తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గట్టి హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది. మీడియా కథనాల మేరకు... పార్టీ అంతర్గత విషయాలపై మీడియాకు ఎక్కవద్దని సూచించారు.