స్పీడ్ న్యూస్-1
posted on Jun 28, 2023 @ 3:37PM
1.మహారాష్ట్రలో పాగా వేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఆయన 600 వాహనాల భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు వెళ్లారు.
2. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుంటే కారు దిగేడయం ఖాయమని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. తమ కోడలు డాక్టర్ అనితారెడ్డి రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉండడంతో ఒకే ఇంట్లో రెండు పదవులు కుదరవని చెబుతున్నారని అన్నారు.
3.శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం నెల్లిపర్తిలో నిన్న నిర్వహించిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’లో స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ మహిళ అడిగిన ప్రశ్నకు చిర్రెత్తిపోయారు. తమ సమస్యలు చెప్పేందుకు వేచి చూస్తున్న మహిళను పట్టించుకోకుండా ముందుకెళ్తుంటే ఆమె అడ్డుకుని తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేశారు.
4.తెలుగుదేశం పార్టీ మహిళా నేతలను సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్న పేటీఎం బ్యాచ్ వెనక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి ఉన్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. భార్గవరెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ పేటీఎం బ్యాచ్ తెలుగు మహిళలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వేధిస్తోందన్నారు.
5. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య కొనసాగుతున్న వివాదం రోజుకో ములుపు తిరుగుతోంది. రాజయ్యపై తాను చేస్తున్న ప్రతి ఆరోపణకు తన వద్ద ఆధారాలున్నాయని నవ్య స్పష్టం చేశారు.
6.తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆయన భద్రతపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
7. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది. వాకాడులో పెద్దఎత్తున జనం రోడ్లపైకి వచ్చి యువనేతకు ఘనస్వాగతం పలికారు.
8.తాము ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పవన్ కల్యాణ్, జగన్, లోకేశ్ లు తనకు స్నేహితులని చెప్పారు.
9. తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ టెస్టులో కొన్ని ప్రశ్నలు తప్పుగా రావడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన పోలీసు నియామక పరీక్షలో 4 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
10.టాటా గ్రూప్ గౌరవ చైర్మన్, వ్యాపార దిగ్గజం రతన్ టాటా క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడుల అంశంపై స్పష్టతనిచ్చారు. క్రిప్టోకరెన్సీతో తనకు ఏ రూపంలోనూ సంబంధం లేదని వెల్లడించారు.