నల్లసూరీడి అస్తమయం
posted on Dec 6, 2013 6:36AM
ఇటీవల తన 95 వ పుట్టినరోజును జరుపుకున్న నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా అస్తమించారు.. 67 సంవత్సరాల పాటు నల్లజాతి హక్కుల పోరాడిన ఈ పోరాట యోదుడి మరణంతో యావత్ ప్రపంచం షాక్ గురైంది.ఈ మహాయోధుడి అంతిమ సంస్కారాలను ఘనంగా నిర్వహించడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణం జూన్ 8 న హాస్పిటల్‌లో చేరిన మండేలా అప్పటి నుంచి ట్రీట్‌మెంట్‌లోనే ఉన్నారు.. ఇంతకు వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక పోయినా నిలకడగా ఉందంటున్నారు డాక్టర్లు. అయితే ఇటీవలే ఆయనను హాస్పిటల్ నుంచి ఇంటికి మార్చారు.
ఆఫ్రికాలో అనగారి వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలకు గుర్తుగా నోబల్ ప్రైజ్‌న్ కూడా అందుకున్నారు మండేలా.. అంతేకాదు ఆయన చేసిన సేవలకు గాను ఆయన పుట్టిన రోజును ఇంటర్‌నేషనల్ మండేలా డేగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. నల్లజాతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆ మహాయోధుడి ఆత్మశాంతి కోసం ప్రపంచమంతా ప్రార్థిస్తుంది.